Telangana Rain Alert : తెలంగాణలోని ఈ ఎనిమిది జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ.. ఇవాళ, రేపు వానలే వానలు..
Telangana Rain Alert : వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు (శుక్రవారం) తెలంగాణలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
- Harish Thanniru
- Published on- August 27, 2026 / 06:32 PM IST
Telangana Rain Alert
Telangana Rain Alert : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుండగా.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. అయితే, తాజాగా.. వాతావరణ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. వచ్చే 24 గంటలపాటు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Also Read : Gold Price Drop : బంగారం కొనేవాళ్లకు శుభవార్త.. వారంరోజుల్లో భారీగా తగ్గనున్న రేట్లు..! కారణం ఇదే..
వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ, రేపు (శుక్రవారం) భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే, ఆయా జిల్లాల్లో వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆయా జిల్లాల్లో కొన్ని ప్రాతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయని తెలిపింది.
రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపిన వాతావరణ శాఖ.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని తెలిపింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
