Telangana Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.  మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట్ లో 158.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

Telangana Rains (11)

Heavy Rains In Telangana : తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్ప పీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాల కురుస్తాయిని తెలిపింది. గంటకు 30 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెండు రోజులు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.  మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట్ లో 158.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో 144.2 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది. సూర్యపేట జిల్లా పాలకేడు మండలంలోని అంలంగాపురంలో 135.0 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. వనపర్తి జిల్లా ఘన్ పూర్ లో 121 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ లో వాతావరణం మారింది.

తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

Dairy Farm : వానాకాలం పాడిపరిశ్రమలో జాగ్రత్తలు

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణా నగర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

ట్రెండింగ్ వార్తలు