Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

Heavy Rain In Hyderabad

Hyderabad Heavy Rain : హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

దీంతో  తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణా నగర్, ఫిల్మ్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్ పేట్, మణికొండ, రాయదుర్గం, మెహిదీపట్నం, టోలీచౌకీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తోపాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలానగర్, కూకట్ పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది.

Heavy Rains : తెలంగాణలో రానున్న మూడు రోజలు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షానికి జీహెచ్ఎంసీ, ఈవీడీఎం అప్రమత్తం అయ్యాయి. తమ ప్రాంతాల్లో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని జీహెచ్ఎంసీ, ఈవీడీఎం కోరాయి.

040-21111111 లేదా 9000113667 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు.హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Cotton Crop : వర్షాలు పడుతున్న సమయంలో పత్తిలో పాటించాల్సిన మెళుకువలు

గంటకు 30 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రెండు రోజులు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.