Schools Holiday : విద్యార్థులకు పండగే.. ఎల్లుండే మొహర్రం.. స్కూళ్లకు సెలవు..!

Schools Holiday : మొహర్రం పండగ సందర్భంగా విద్యార్థులకు మళ్లీ సెలవు.. జూన్ 26న పండగ రోజున ప్రభుత్వ హాలిడే రోజున స్కూళ్లు పనిచేయవు. ఉద్యోగులకు ఒక రోజు ముందు ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది.

Schools Holiday

Schools Holiday : విద్యార్థులకు ఎగిరిగంతేసే న్యూస్.. మళ్లీ సెలవులు వచ్చేస్తున్నాయి.. ఎల్లుండి స్కూళ్లకు సెలవు.. జూన్ 26న మొహర్రం పండగ ఉంది.. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూళ్లకు పండగ సెలవు ప్రకటించారు. కేవలం స్కూళ్లకే కాదు.. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా హాలిడే ఉంటుంది.

మొహర్రం సందర్భంగా జూన్ 25న తెలంగాణ ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. అంటే.. అర్హత ఉన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా కొంతమంది ఉద్యోగులకు వరుసగా సెలవులు వచ్చే అవకాశం ఉంది.

Read Also : Telangana Employees : తెలంగాణ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. పైసా ప్రీమియం కట్టనక్కర్లేదు.. ఒక్కొక్కరికి రూ. 1.20 కోట్ల బీమా కవరేజ్!

గురువారం ఒక్క రోజున స్కూళ్లు తెరిచే ఉంటాయి. శుక్రవారం పండగ రోజున స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత శనివారం ఒక్కరోజే స్కూల్ ఓపెన్ అవుతుంది. కానీ, ఆదివారం కూడా సెలవే ఉండనుంది.

మొహర్రం పండగకు ఇస్లాం మతంలో పవిత్రమైన రోజుగా చెబుతారు. ఈ పర్వదినాన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని స్కూళ్లకు సెలవు ఉంటుంది.