వామ్మో కరోనా టైంలో కూడా నాటుకోడికి ఇంత డిమాండా?

  • Publish Date - July 18, 2020 / 04:09 PM IST

దేశమంతా కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది… ఇలాంటి సమయంలో నాటుకోడి తింటే కరోనాకు చెక్ పెట్టచని వార్తలు వినిపిస్తున్నాయి. వాన పడుతుంటే చేపతిలో నాటుకోడి కూర నంచుకుని తింటే ఆ మాజనే వేరు. అయితే నాటుకోడి కూరలో అధిక పోషకాలు ఎక్కువగా ఉంటాయట. అందుకే ఇది తింటే కరోనాకు ఇట్టే గుడ్ బై చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు.

ఇంకా అంతే సంగతులు… మాంసం ప్రియులంతా నాటుకోడి కోసం ఎగబడ్డారు. దీంతో నాటుకోడికి ధరలు రెట్టింపయ్యాయి. ఏకంగా రూ. 200 నుంచి రూ. 450 కు చేరుకుంది.

ఇక రేట్ ఎంత అయినా పర్లేదు నాటుకోడి దొరికితే చాలంటూ.. నాన్ వెజ్ లవర్స్ క్యూ కడుతున్నారు. దీంతో మార్కెట్ లో నాటుకోడికి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.