Hyderabad : కట్టలు కట్టలు.. హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం, రూ.3కోట్ల నగదు పట్టివేత

స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. Hyderabad

Hyderabad Huge Money Seized (Google)

Hyderabad Huge Money Seized : హైదరాబాద్ లో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. ఇప్పటికే కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. తాజాగా మరోసారి పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం కలకలం రేపింది. AMR సంస్థకు చెందిన మహేశ్ రెడ్డి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

కర్ణాటక నుంచి డబ్బు తరలిస్తుండగా పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక కీలక నేతకు AMR సంస్థకు చెందిన మహేశ్ రెడ్డి బినామీగా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల నగదును ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు.

Also Read : హైదరాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న రూ.2.9 కోట్లు స్వాధీనం, ఆరుగురు అరెస్టు

కోట్ల రూపాయల నగదు సీజ్..
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న డబ్బును పోలీసులు సీజ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. వ్యక్తుల వాహనాల్లో లక్షలు, కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకుంటున్నారు.

ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఆ డబ్బుని సీజ్ చేస్తున్నారు. అనంతరం డబ్బును ఐటీ అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు హెచ్చరికలు, కీలక సూచనలు చేశారు. సరైన పత్రాలు లేకుండా డబ్బును తరలించొద్దని కోరారు. డబ్బు తీసుకెళ్తున్న సమయంలో సరైన డాక్యుమెంట్స్ చూపించాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

పోలీసుల తనిఖీలతో పబ్లిక్ పరేషాన్..
కాగా, డబ్బుని పోలీసులు సీజ్ చేస్తుండటంతో జనాలు పరేషాన్ అవుతున్నారు. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పబ్లిక్ అయితే ఎన్నికల కమిషన్ తీరుపై కస్సుమంటున్నారు. ఈ క్రమంలో ప్రజల బాధలను అర్థం చేసుకున్న ఈసీ.. పట్టుబడిన డబ్బును వెనక్కి ఇచ్చేందుకు జిల్లాకో సెంటర్ పెట్టింది. అప్పు చెల్లించడానికో, కొన్న భూమికి డబ్బు కట్టడానికో, లేదంటే కొన్న బంగారం తీసుకుపోతుంటే ఆధారాలు లేవని పోలీసులు సీజ్ చేసిన సొమ్మును.. సరైన పత్రాలు, ఆధారాలు చూపిస్తే వెనక్కి ఇచ్చేస్తారు.

Also Read : మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం

సరైన పత్రాలు చూపిస్తే సొమ్ము వాపస్..
అయితే కోట్ల రూపాయలు పట్టుకున్నా తిరిగి ఇస్తారని అనుకుంటే బురదలో కాలేసినట్లే. సొమ్ము అయినా, సొత్తు అయినా పది లక్షల లోపు అయితేనే తిరిగి వెనక్కి ఇస్తారు. అది కూడా లెక్కాపత్రం కరెక్ట్ గా ఉంటేనే వాపస్ ఇస్తామంటున్నారు అధికారులు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కలెక్టర్ ఆఫీసుకి వెళ్లి ఆధారాలు సమర్పించాలి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టుగానే ఉంటే పోలీసులు సొమ్మును వెనక్కి ఇస్తారు. అయితే, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సొమ్మును పట్టుకున్న 48గంటల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ తిప్పలన్నీ పడటం ఎందుకు అనుకుంటే.. సరైన పత్రాలు వెంట తీసుకుని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే తిప్పలు తప్పవని, ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదని స్పష్టం చేస్తున్నారు.