Husband Missing : నా భర్త కనిపించడం లేదు..కెనడాలో హైదరాబాద్ యువతి ఆవేదన
కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది.
- kunduru Vinod
- Published on- September 18, 2021 / 12:43 PM IST
Husband Missing
Husband Missing : కెనడాలోని మాంట్రియల్లో ఉంటున్న దీప్తిరెడ్డి అనే వివాహిత మూడు నెలల నుంచి తన భర్త కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖకు ట్విటర్లో తెలిపింది. మూడు నెలల క్రితం తన భర్త తనను వదిలేసి ఇండియాకు వచ్చేశారని, ప్రస్తుతం తాను రెండు నెలల గర్భవతి అని వెల్లడించారు. తన భర్త అనుగుల చంద్ర శేఖర్ రెడ్డి కెనడాలో మెక్గ్రిల్ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పనిచేసేవారని తెలిపింది. తన భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ట్విట్టర్ ద్వారా భారత విదేశాంగ శాఖను కోరింది.
Read More : MAA Elections 2021 : అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు.. జనరల్ సెక్రెటరీగా రఘుబాబు..
కాగా భర్త కుటుంబ సభ్యులు తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిపింది దీప్తి, తన భావ శ్రీనివాస రెడ్డి చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని ఆమె పేర్కొంది. భర్త ఆచూకీ విషయంమై 2021 ఆగస్టు 20న ఫిర్యాదు చేశానని కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని తెలిపింది.
Read More : General Sherman tree : 2,300 ఏళ్ల వయస్సున్న భారీ వృక్షానికి అల్యూమినియం కవర్
ఫిర్యాదులో తన ఆరోగ్యం విషయంపై కూడా ప్రస్తావించింది..ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని ట్విటర్లో వాపోయింది. ఇక దీప్తి విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ రాచకొండ పోలీస్ కమిషనరేట్ కు సమాచారం ఇచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చంద్ర శేఖర్ రెడ్డి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.
