×
Ad

Huzurabad By Poll : విజయం ముందే ఊహించాం – బండి సంజయ్

ఈ విజయం తాము ముందే ఊహించిందని, హుజూరాబాద్ గడ్డపై భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.

  • Published On : November 2, 2021 / 03:14 PM IST

Bjp Chief Bandi Sanjay

Huzurabad Bandi Sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఫలితాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా…నేనా అన్నట్లుగా కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు ఉత్కంఠను కలుగ చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్..సమీప టీఆర్ఎస్…ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ పై అధిక్యం కనబరుస్తున్నారు. పదో రౌండ్ ముగిసే సరికి 526 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు ఈటల. ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీకి చెందినే నేతలు. ఈ సందర్భంగా…బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 10tvతో మాట్లాడారు.

Read More : Huzurabad by election : కారును వెనక్కి నెట్టేసి..10వ రౌండ్ లోను బీజేపీ ముందంజ

ఈ విజయం తాము ముందే ఊహించిందన్నారు. హుజూరాబాద్ గడ్డపై భారీ మెజార్టీతో గెలువబోతున్నట్లు వెల్లడించారు. అక్కడి ప్రజలు తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రదర్శించారని, తాము డబ్బులకు అమ్ముడుపోము అని నిరూపించారన్నారు. ఏ విధంగా మోసం చేసినా..ప్రజలు భరించలేకపోయారని…వరి వేస్తే…ఉరే అనే భయానక వాతావరణాన్ని చూసి రైతాంగం ఒక్కటయ్యారని వెల్లడించారు. గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరగాలని ఎవరు కోరుకోరని, తమపై చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ – టీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ విమర్శిస్తోందని, కాంగ్రెస్ – బీజేపీ ఒక్కటేనని టీఆర్ఎస్ అంటోందని తెలిపారు. కాంగ్రెస్ గల్లీలో లేదు ఢిల్లీలో లేదు.. టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్మున్న పార్టీ బీజేపీ అని ప్రజలు నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు.పోలింగ్ రోజు తమ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని చూసి అన్ని పార్టీల నేతలు హాట్సాఫ్ అంటున్నాయని తెలిపారు బండి సంజయ్.