Hyderabad Crime : దారుణ ఘటన.. ప్రియురాలిని కత్తితో పొడిచి గోనెసంచిలో కుక్కి.. అందరూ మాటలంటున్నారని..
Hyderabad Crime : హైదరాబాద్ శివారు ప్రాంతం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- August 18, 2026 / 08:10 AM IST
Boyfriend Killed His Girlfriend
Hyderabad Crime : హైదరాబాద్ శివారు ప్రాంతం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న యువతి పెండ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో.. ప్రియురాలిని కత్తితో పొడిచి హత్యచేసి.. గోనెసంచిలో కుక్కి పడెయ్యడానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టుకుని కటక టాల్లోకి నెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలాపూర్ బిస్మిల్లా కాలనీకి చెందిన అహ్మద్ సలాం (21) స్థానిక ఫంక్షన్‌హాల్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఆదే ఫంక్షన్‌హాల్‌లో బిహార్‌కు చెందిన రెహానా (21) కూడా లేబర్‌గా పనిచేసేది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కొంతకాలంకు ప్రేమగా మారింది. ఇద్దరూ బిస్మిల్లా కాలనీలోని సలాం ఇంట్లోనే కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే, రెహానా కొద్దిరోజుల నుంచి తనను పెండ్లి చేసుకోవాలని అహ్మద్ సలాంపై ఒత్తిడి తెచ్చింది. సమాజంలో నాకు నీ భార్యగా గుర్తింపు కావాలి.. వెంటనే నన్ను పెండ్లి చేసుకో అంటూ పట్టుబట్టింది.
రెహానా పెండ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన సలాం విచక్షణ కోల్పోయి రెహానాను కత్తితో పొడిచి చంపేశాడు. ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని గోనెసంచిలో కట్టాడు. ఆ మూటను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి పడేయాలని భావించాడు. అయితే, ఈ విషయాన్ని గమనించిన పక్కటివాళ్లు తెల్లవారు జామున 5గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటన స్థలికి చేరుకొని అహ్మద్ సలాం ఇంట్లో తనిఖీలు చేశారు. గోనెసంచిలో మూటకట్టిన డెడ్ బాడీని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడు అహ్మద్ సలాంను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, రెహానా కొంతకాలంగా వేరేవాళ్లతో చనువుగా ఉంటుందనే అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నట్లు సమాచారం.
