RTC Metro Common Pass : హైదరాబాద్ వాసులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఒక్క పాస్‌తో ఆర్టీసీ, మెట్రోలో నెలంతా తిరగొచ్చు.. ధర జస్ట్..!
RTC Metro Common Pass : హైదరాబాద్ వాసులకు భారీ గుడ్‌న్యూస్. ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు ఇక కామన్ పాస్.. అక్టోబర్ 2 నుంచి అందుబాటులోకి రానుంది. రోజువారీ, వారపు, నెలవారీ పాస్ ధరలు, పూర్తి వివరాలివే..
- Sreehari A
- Published on- October 1, 2026 / 09:50 PM IST
RTC Metro Common Pass
- బస్సు, మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త
- ఆర్టీసీ, మెట్రోకు కామన్ పాస్ వచ్చేసింది
- టికెట్ క్యూలకు చెక్.. ఒక్క పాస్‌తో బస్సు, మెట్రో జర్నీ
RTC Metro Common Pass : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఇకపై ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేవారికి పదేపదే టికెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా కామన్ ట్రావెల్ పాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి. అక్టోబర్ 2న ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సదుపాయాన్ని ప్రారంభించనున్నారు.
నెలకు ధర ఎంతంటే? :
ఈ కామన్ పాస్ ద్వారా ఒకే పాస్‌తో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించవచ్చు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రోజువారీ, వారపు, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టనున్నారు. అందిన సమాచారం ప్రకారం.. రోజువారీ పాస్ ధర రూ.400 కాగా, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు.
Read Also : Telangana Government : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా బొనాంజా.. రెండు డీఏలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
అన్ని బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణం :
ఈ పాస్ హైదరాబాద్ నగర పరిధిలోని ఆర్టీసీ సేవలకు వర్తించనుంది. ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలోనూ వాడుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు రేంజ్ వరకు పాస్ వ్యాలీడ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా నగర శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రస్తుతం బస్సుల్లో ప్రతిసారీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మెట్రోలో ఫిజికల్ టికెట్ కోసం కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సి వస్తుంది. కామన్ పాస్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాసెస్ చాలా ఈజీ కానుంది. ముఖ్యంగా ప్రతిరోజూ బస్సు, మెట్రో రెండింటిలో వెళ్లే ప్రయాణికులకు సమయం చాలా ఆదా అవుతుంది.
మొబైల్ యాప్ ద్వారా.. :
మరోవైపు.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం డిజిటల్ టికెటింగ్, పాస్ సదుపాయాలను కూడా విస్తరించనుంది. రోజువారీ టికెట్లతో పాటు డే, వీక్లీ, నెలవారీ పాస్‌లను మొబైల్ యాప్ ద్వారా పొందవచ్చు. ఇక పాస్ కోసం ఆర్టీసీ కౌంటర్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఫిజికల్ టికెట్‌కు బదులుగా మొబైల్‌లోనే పాస్‌ను పొందే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 2 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. బస్సు, మెట్రో సేవలను తరచుగా వినియోగించే ప్రయాణికులకు ఒకే పాస్‌తో ప్రయాణం చేయొచ్చు.
