Londion School
Hyderabad Girl: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ లో అడ్మిషన్ కొట్టేసింది కొంపల్లి స్టూడెంట్. సాధు వాశ్వానీ ఇంటర్నేషన్ స్కూల్ (ఎస్వీఐఎస్)లో అదితీ విట్టల్ సీబీఎస్ఈ 12వ తరగతి చదువుతోంది. అదే కాకుండా ఇతర టాప్ యూనివర్సిటీల నుంచి సెక్యూర్డ్ అడ్మిషన్ల నుంచి అంటే యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ లలోనూ అడ్మిషన్ అర్హత సాధించింది.
ఎకనామిస్టుగా ఎదగడానికి.. అదితీ ఎల్ఎస్ఈ లేదా టొరంటో యూనివర్సిటీలలో చేరుతుందా అనేది ఆమె ఇష్టం. ఎల్ఎస్ఈ లో బీఎస్సీ ఎకనామిక్స్ ప్రోగ్రాంలో చేరడం చాలా కాంపిటీటివ్ టాస్క్. సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ స్టూడెంట్లకు కనీసం 90శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి. 95శాతం మార్కులు లేదా రెండు సబ్జెక్టుల్లో 90శాతానికి పైగా ఉండాలి.
ఐఈఎల్టీఎస్ లో 7.0 స్కోరు వచ్చి ఉండాలి. ప్రతి సెక్షన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే పూర్తి చేయగలగాలి. ఈ అర్హతలన్నీ సాధించిన తర్వాత విద్యార్హతల ఆధారంగా సబ్జెక్టులు, సబ్జెక్ట్ కాంబినేషన్స్, పర్సనల్ స్టేట్మెంట్, టీచర్స్ రిఫరెన్స్, ఎడ్యుకేషనల్ సర్కంస్టెన్సెస్ లను పరిశీలిస్తారు.
ఎల్ఎస్ఈ ఈ మేర 1600 సీట్లకు గానూ 140దేశాలకు చెందిన 25వేల అప్లికేషన్లను పరిశీలించింది.
అదితీ పదో తరగతి తర్వాత హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ స్ట్రీమ్ ఎంపిక చేసుకుంది. స్కూల్ స్టడీస్ మాత్రమే కాకుండా.. హార్వార్డ్ ప్రీ కాలేజ్ ప్రోగ్రాంలో గ్రేట్ ఐడియాస్ మాక్రోఎకనామిక్స్ ఆన్ లైన్ సర్టిఫికేషన్ కోర్స్ పూర్తి చేసింది. గ్లోబల్ ఛాలెంజెస్ సెషన్ సాల్వ్ చేసినందుకు గానూ.. యలె యంగ్ గ్లోబల్ స్కాలర్ గా ఎంపికైంది అదితీ.
2020లో పలు రకాల యాక్టివిటీస్ తో బిజీగా ఉంది అదితీ. కొవిడ్-19 మహమ్మారి కారణంగా స్కూల్ లైఫ్ అంతా ఆన్ లైన్ కు మారిపోవడంతో మరింత సమయం దొరికింది. స్కూల్ లో చీఫ్ స్టూడెంట్ ఎడిటర్ అయిన అదితీ.. స్కూల్ మ్యాగజైన్ కు డిజిటల్ వర్షన్ ను రెడీ చేసింది.