KPHB Plot Auction : హైదరాబాద్‌లో ప్లాట్ల వేలం.. కేపీహెచ్‌బీ, మోకిల్లా, బాచుపల్లిలో రికార్డు ధరలు..

KPHB Plot Auction : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) స్థలాలతో పాటు మోకిల్లా, బాచుపల్లిలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.

KPHB Plots Auction

KPHB Plot Auction : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి. తాజాగా.. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) స్థలాలతో పాటు మోకిల్లా, బాచుపల్లిలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. బుధవారం నిర్వహించిన బహిరంగ, ఈ-వేలంలో కొనుగోలుదారులు పోటీపడి ప్లాట్లను దక్కించుకున్నారు.

Also Read : Gold Silver Price Today : గోల్డ్ ప్రియులకు బిగ్‌న్యూస్.. బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

కేపీహెచ్‌బీలో చదరపు గజం అత్యధికంగా రూ.2.70 లక్షలు పలికింది. మోకిల్లాలో గజం గరిష్ఠ ధర రూ.87,500 కాగా, బాచుపల్లిలో రూ.67,500 పలికింది. కేపీహెచ్‌బీలో 13 ప్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది. మోకిల్లా, బాచుపల్లి ప్లాట్ల విక్రయాల ద్వారా హెచ్‌ఎండీఏకు మొత్తంగా రూ.101 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.

కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని 16 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించారు. నోటిఫికేషన్‌లో గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఆ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా చెల్లించేందుకు కూడా వ్యాపారులు పోటీపడ్డారు.

ప్లాట్ నంబర్-8 నార్త్ ఈస్ట్ కార్నర్ కావడంతో 194.44 గజాల ఈ స్థలం గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. ప్లాట్ నంబర్-9 గజం రూ.2.36 లక్షలు, ప్లాట్ నంబర్-1, 7 గజం రూ.2.06 లక్షలు, ప్లాట్ నంబర్-6 గజం రూ.2.02 లక్షలు పలికాయి. మొత్తంగా 13 ప్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల ఆదాయం లభించింది.

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మోకిల్లాలోని ప్లాట్లకు ఈ-వేలం నిర్వహించారు. మొత్తం 32ప్లాట్లు అమ్ముడుపోగా రూ.66.48 కోట్ల ఆదాయం వచ్చింది. మోకిల్లాలో గజం అత్యధికంగా రూ.87,500 ధర పలికింది. అదేవిధంగా
బాచుపల్లిలోని మొత్తం 25 ప్లాట్లు విక్రయించారు. ఇక్కడ గజం అత్యధికంగా రూ.67,500 పలికింది. 25 ప్లాట్ల విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ.35.05 కోట్ల ఆదాయం సమకూరింది. మోకిల్లా, బాచుపల్లి ప్లాట్ల విక్రయాలతో హెచ్‌ఎండీఏకు కలిపి రూ.101 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.