×
Ad

Hyderabad: లోన్‌ యాప్‌ మోసగాళ్ల బారిన పడ్డ మరో వ్యక్తి.. సైబర్‌ నేరగాళ్లు ఎలా వేధించారంటే?

ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపుతామంటూ వేధించారు.

Loan App

  • హైదరాబాద్‌లోని సనత్‌ నగర్‌లో ఘటన
  • ఓ వ్యక్తి నుంచి రూ.36 లక్షల వసూలు
  •  ‘లోన్ రాడార్’, ‘క్విక్ ఫండ్స్’ యాప్‌ల ద్వారా మోసం

Hyderabad: ప్రజలకు పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఇప్పటికీ చాలా మంది లోన్‌ యాప్‌ల బారిన చిక్కుకుంటున్నారు. హైదరాబాద్‌లో లోన్ యాప్‌ల వేధింపులు కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది.

నగరంలోని సనత్‌నగర్ వ్యక్తి నుంచి రూ.36 లక్షలు అదనంగా వసూలు చేశారు కేటుగాళ్లు. ‘లోన్ రాడార్’, ‘క్విక్ ఫండ్స్’ యాప్‌ల ద్వారా ఈ మోసానికి పాల్పడ్డారు.

సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2025 ఆగస్టులో బాధితులు ‘లోన్ రాడార్’, ‘క్విక్ ఫండ్స్’ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. చిన్న మొత్తంలో అప్పు తీసుకుని తిరిగి చెల్లించాడు.

Also Read: Revanth Reddy: వాళ్లకు ఓట్లు మాత్రమే కావాలి, కానీ..: రేవంత్ రెడ్డి ఫైర్

ఆ తర్వాత ఆయన అడగకుండానే ఆయన అకౌంట్‌లోకి భారీ మొత్తంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు జమ చేశారు. 7 రోజుల గడువులో వడ్డీతో పాటు డబ్బులు చెల్లించాలని బెదిరింపులు ప్రారంభించారు.

ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపుతామంటూ వేధించారు. 2025 సెప్టెంబరు- 2026 ఫిబ్రవరి మధ్య రూ.64 లక్షలు చెల్లింపులు చేశాడు బాధితుడు. అతడికి మొత్తం రూ.36.16 లక్షల నష్టం వచ్చింది. అక్రమ లోన్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.