Hyderabad Metro Management : ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నా : మెట్రో రైలు యజమాన్యం

తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. మెట్రో రైలు సిబ్బంది ధర్నాపై యాజమాన్యం స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నాకు దిగారని పేర్కొంది.

Hyderabad Metro Management :హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తమ జీతాలు పెంచాలని ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. మెట్రో రైలు సిబ్బంది ధర్నాపై యాజమాన్యం స్పందించింది. ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగ సిబ్బంది ధర్నాకు దిగారని పేర్కొంది. మెట్రో సర్వీసులను అడ్డుకోవడమే వారి ఉద్దేశమని ఆరోపించింది.

టికెట్ సిబ్బంది చేస్తున్న ఆరోపణలు అబద్దమని తెలిపింది. ధర్నా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. మెట్రో సర్వీసుల టైమ్ ప్రకారమే నడుస్తున్నాయని చెప్పింది. సమస్యలు తెలుసుకోవడానికి మెట్రో సిబ్బందితో చర్చిస్తామని తెలిపింది.

Hyderabad Metro Employees Protest : హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన.. జీతాలు పెంచాలని విధులు బహిష్కరించి నిరసన

హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మెట్రో టికెటింగ్ లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

జీతాలు పెంచాలని నిన్న సాయంత్రమే ఏజెన్సీకి ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో 150 మంది ఉద్యోగులు విధులకు హారు కాలేదు. దీంతో ఇతర ఉద్యోగులను కౌంటర్లతో కూర్చోబెట్టి మెట్రో అధికారులు టికెట్లు జారీ చేయిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు