Hyderabad Police Issue Tough Guidelines For New Year Parties
Hyderabad Police : మరికొద్ది గంటల్లో 2022 కొత్త ఏడాది రాబోతోంది. 2021కి వీడ్కోలు పలికేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకవైపు కరోనా కొత్త వేరియంట్ఒమిక్రాన్ వ్యాప్తిచెందుతున్నప్పటికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో నగరయువత వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.
డిసెంబర్ 31 నుంచి సాయంత్రం నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. ఈసారి రాత్రి 10 గంటలకే నగరంలో ఫ్లైఓవర్లు అన్నీ మూతపడనున్నాయి. బేగంపేట ఫ్లైఓవర్ కు ఆంక్షల నుంచి మినహాయించారు ట్రాఫిక్ పోలీసులు. మిగితా ఫ్లైఓవర్లను మాత్రం మూసివేయనున్నారు. ప్రధాన కూడళ్లలో ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
పెండింగ్ చలానాలతో పాటు ట్రాఫిక్ వైలెట్స్ పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ కావడంతో మద్యం సేవించి రోడ్లపై వాహనాల్లో వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే నక్లెస్ రోడ్డులో పోలీసుల తనిఖీలు చేయడం మొదలైంది. నగరంలో కఠిన ఆంక్షల నేపథ్యంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్లపై పోలీసులు నిఘా పెట్టారు.
ఈవెంట్లపై పోలీసులు ఆంక్షలతో మీడియాకు అనుమతిని నిరాకరిస్తున్నాయి ఈవెంట్స్ మేనేజ్ మెంట్స్ నిర్వహాకులు. ఈవెంట్లలోనూ ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వ కొవిడ్ నిబంధనల్లో పేర్కొంది. ఈవెంట్లు, పబ్బుల్లో బయట కోవిడ్ నిబంధనల హెచ్చరికల బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధనల్లో పేర్కొంది.
Read Also : APSRTC GST : ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..! వాటి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే బాదుడే