APSRTC GST : ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..! వాటి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే బాదుడే

పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా..

APSRTC GST : ఆర్టీసీ ప్రయాణికులకు అలర్ట్..! వాటి ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే బాదుడే

Apsrtc Gst

APSRTC GST : పేటీఎం, రెడ్ బెస్, అభిబస్ లాంటి ప్రైవేట్ సైట్లు, యాప్స్ ద్వారా ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్ చేసుకునే వారిపై ఇక నుంచి అదనపు భారం పడనుంది. ప్రైవేట్ పోర్టల్స్, యాప్స్ ద్వారా బుక్ చేసుకునే నాన్ ఏసీ టికెట్లపై ఏపీఎస్ఆర్టీసీ 5శాతం జీఎస్టీ విధించింది. కాగా, పూర్తి సేవా దృక్పథంతో నిర్వహించే ఆర్టీసీ పోర్టల్, బుకింగ్ కౌంటర్లు, ఆర్టీసీ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకునే టికెట్లకు, నేరుగా బస్సుల్లో తీసుకునే టికెట్లకు జీఎస్టీ వర్తించదని అధికారులు తెలిపారు.

Dhanurasana : ధనురాసనంతో కండరాలు బలోపేతం

కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1 నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్‌.. ఆ వార్త ఫేక్..!

ఈ క్రమంలో ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ అధికారులు కీలక సూచన చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఆర్టీసీ పోర్టల్, ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.