Dhanurasana : ధనురాసనంతో కండరాలు బలోపేతం

ఈ ధనురాసనం చేసే విధానాన్ని పరిశీలిస్తే.. ముందుగా ఆసనం మీద బోర్ల పడుకోవాలి, రెండు కాళ్ళను మడవాలి, చేతులతో చీలమండలను పట్టుకోవాలి.

Dhanurasana : ధనురాసనంతో కండరాలు బలోపేతం

Danurasan1

Dhanurasana : మనిషి ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంచటంలో యోగాసనాలు ఎంతో దోహదపడతాయి. ముఖ్యంగా శరీరానికి శక్తి, బలాన్ని ఇవ్వటంతో పాటు అంతర్భాగాలు ఆరోగ్యంగా ఉండాలంటే ధనురాసనం ఎంతో ఉపయోగపడుతుంది. ధనురాసనం అనగా శరీరాన్ని ధనుస్సులాగా అంటే బాణంలాగా వంచాలి. అందుకే దీనికి ధనురాసనం అని పేరు వచ్చింది.

ధనుస్సును ఎక్కుపెట్టి లక్ష్యాన్ని చెందించినట్లు, ఈ యోగాసనం చేసేవారు సాధ్యమైనంత ఎక్కువ శక్తిని సమాకుర్చుకొని చురుకుగా తయారు అవుతారు. దీనిని చేయటంలో శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజితమౌతాయి.

ఈ ఆసనం వలన మన శరీరంలోని అతి ముఖ్యభాగలైన కడుపు వీపు, పైన అత్యధిక ప్రభావం పడుతుంది. పొత్తికడుపులోని కండరాలు ఎక్కువ శక్తిని పొందుతాయి. మహిళలు ఈ ఆసనం వేయటం వల్ల గర్బాశయ, ఋతుశ్రావలకు సంబందించిన సమస్యలన్నీ దూరం అవుతాయి. వెన్ను కింది భాగంలో కరుకుతనం తగ్గుతుంది.

మెడ, భుజాలు, బహువులు, ఊపిరితిత్తులు, ప్రక్కటేముకలు, తొడలు, ముడుకులు, కాళ్ళలోని కండరాలు, నరాలు, నాడులు, బలంగా తయారు అవుతాయి. నడుము సన్నబడుతుంది. లావు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

నాడి మండలంలోను ఆరోగ్యాన్ని, బలాన్ని పుంజుకుంటాయి. గ్రందులతోపాటు, నాడిమండలంలో చురుకుతనం పెరుగుతుంది. జీర్ణశక్తి బాగుపడుతుంది. విరోచనాలు, పేగులలో నీరసం, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, దూరం అవుతాయి. రక్తపోటు సమస్యలు తోలగిపోతాయి. శరీరంలోని అన్ని రకాల కీళ్ళ జాయింట్లు బలోపేతమవుతాయి. పొట్ట, నడుము భాగంలోని కొవ్వు కరిగిపోతుంది.

ఈ ధనురాసనం చేసే విధానాన్ని పరిశీలిస్తే.. ముందుగా ఆసనం మీద బోర్ల పడుకోవాలి, రెండు కాళ్ళను మడవాలి, చేతులతో చీలమండలను పట్టుకోవాలి. ఐదు వేళ్ళు ఒకే దిశలో ఉండాలి. మోకాళ్ళను సాధ్యమైనంత దగ్గరగా ఉంచాలి. తలను భూమికి అనించాలి. శ్వాసను విడిచి మోకాళ్ళను సాధ్యమైనంత పైకి ఎత్తాలి. ఆపైన శ్వాసను పీల్చుతూ మేడను ఎత్తుతు శరీరాన్ని కూడా సాధ్యమైనంత పైకి ఎత్తాలి. శ్వాసను సామాన్యంగా ఉంచాలి. కొంచెం సేపు ఈ స్థితిలోనే ఉండాలి. మెల్లగా యాదస్థితికి వచ్చి  విశ్రాంతి తీసుకోవాలి.

అయితే ఈ ఆసనం చేసే ముందు ముఖ్యమైన సమాచారం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్నవారు ముఖ్యంగా హర్నియా, పెద్దప్రేవు సమస్య, అల్సర్లు, గుండె జబ్బులు, రక్తపోటు సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ ధనురాసనాన్ని ట్రై చేయకపోవటమే బెటర్. ఉదర సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు పూర్తిగా కోలుకునేంత వరకు ఈ ఆసనాన్ని వేయకూడదు.