Hyderabad Rain : హైదరాబాద్‌లో వర్షం.. నగరవాసులకు ఉక్క‌పోత నుంచి రిలీఫ్..!

Hyderabad Rain : హైద‌రాబాద్‌లో నగరంలో శుక్ర‌వారం సాయంత్రం ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటివరకూ ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు చిరుజ‌ల్లుల‌తో ఉపశమనం కలిగింది.

Hyderabad Rain Rain In Hyderabad, Weather Alert To Hyderabad City People Another Two Days

Hyderabad Rain : హైద‌రాబాద్‌లో నగరంలో శుక్ర‌వారం (ఏప్రిల్ 15) సాయంత్రం ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇప్పటివరకూ ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు చిరుజ‌ల్లుల‌తో కాస్తా ఉపశమనం కలిగింది. ఓ మోస్తరు వర్షం కురియడంతో నగరమంతా చల్లబడింది. మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండ.. సాయంత్రానికి చల్లబడటంతో వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురిసింది.

సుల్తాన్ బ‌జార్, నాంప‌ల్లి, కోఠి, బ‌షీర్‌బాగ్, హిమాయ‌త్ న‌గ‌ర్, చిల‌క‌ల‌గూడ‌, ప‌ద్మారావు న‌గ‌ర్, నారాయ‌ణ‌గూడ‌, సికింద్రాబాద్, మారేడ్‌ప‌ల్లి, బోయిన్‌ప‌ల్లి, బేగంపేట‌తో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. నగరంలో శనివారం (ఏప్రిల్ 16) సాయంత్రం భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. రాబోయే రెండు రోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం లేద‌ని వెల్లడించింది.

మరోవైపు.. దుండిగ‌ల్, మేడ్చ‌ల్‌లో వ‌డ‌గ‌ళ్ల వాన‌ కురిసింది. నగర ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురియడంతో.. దుండిగ‌ల్, గుమ్మ‌డిద‌ల‌, అమీన్‌పూర్, జిన్నారం, మేడ్చ‌ల్ ఏరియాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. లోతట్టు ప్రాంతాల్లోని వారంతా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read Also : Rains In Telangana : తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు-ఎల్లో అలర్ట్ జారీ