Rains In Telangana : తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు-ఎల్లో అలర్ట్ జారీ

రాబోయే 48 గంట‌ల పాటు హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా మేఘావృతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి స‌మ‌యాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని

Rains In Telangana : తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు-ఎల్లో అలర్ట్ జారీ

Rains In Telangana

Updated On : April 4, 2022 / 7:32 PM IST

Rains In Telangana :  మర‌ఠ్వాడా నుంచి క‌ర్ణాట‌క మీదుగా త‌మిళ‌నాడు వ‌ర‌కు విస్త‌రించి ఉన్న ద్రోణి కార‌ణంగా రాష్ట్రంలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ లోని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

రాబోయే 48 గంట‌ల పాటు హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా మేఘావృతం అయ్యే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం, రాత్రి స‌మ‌యాల్లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని తెలిపారు.

ఆదిలాబాద్, నిర్మ‌ల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మెద‌క్, సంగారెడ్డి, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట జిల్లాల‌కు  భారత వాతావరణ శాఖ  ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మంగ‌ళ‌వారం వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.

Also Read : Harish Rao : పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించాలి-హరీష్ రావు