Hyderabad: జిమ్ కి వెళ్తున్నారా జాగ్రత్త.. యువత టార్గెట్‌ గా స్టెరాయిడ్ల దందా.. జిమ్ ట్రైనర్ల ఘరానా మోసం

హైదరాబాద్ (Hyderabad)నగరంలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ఒక ఘరానా ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

Hyderabad Task Force police bust steroid racket targeting gym goers

  • స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
  • జిమ్ ట్రైనర్ల ఘరానా మోసం
  • ఏఐ నకిలీ ప్రిస్క్రిప్షన్ల గుట్టురట్టు

Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, బాడీ బిల్డింగ్ సప్లిమెంట్లు విక్రయిస్తున్న ఒక ఘరానా ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిమ్‌కు వచ్చే యువతనే లక్ష్యంగా చేసుకుని, తక్కువ సమయంలోనే కండరాల పెరుగుదల వస్తుందనే ఆశ చూపిస్తూ ఈ నిషేధిత ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ మీడియాకు వెల్లడించారు.

Tirumala: నువ్వు సూపర్ బామ్మ.. 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు.. గోవిందా.. గోవిందా అనుకుంటూ..

అరెస్ట్ అయిన వారంతా జిమ్ ట్రైనర్లు కావడం గమనార్హం. గతంలో జిమ్ నడిపిన బట్టే శివా అనే ప్రధాన నిందితుడు, వివిధ జిమ్‌లలో ట్రైనర్‌గా చేరుతూ ఈ దందాకు తెరలేపాడు. విస్తుపోయే విషయం ఏంటంటే, ఈ ముఠా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగించి నకిలీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్లను సృష్టించి, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుండి ఈ స్టెరాయిడ్లను హైదరాబాద్‌(Hyderabad)కు అక్రమంగా రప్పిస్తోంది.

ఈ నేపథ్యంలో అర్హత గల వైద్యుల సలహా లేకుండా ఇలాంటి స్టెరాయిడ్లు వాడటం ప్రాణాంతకమని డీసీపీ హెచ్చరించారు. వీటి వల్ల భవిష్యత్తులో తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్ బారిన పడటంతో పాటు లివర్, కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.