Tirumala: నువ్వు సూపర్ బామ్మ.. 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు.. గోవిందా.. గోవిందా అనుకుంటూ..
నూరేళ్లు దాటిన వయసులో కాలినడకన ఆ స్వామి(Tirumala) చెంతకు చేరడం భక్తి పరాకాష్టకు నిదర్శనం.
A 116 year old grandmother climbed Alipiri steps at tirumala for darshan of Lord Sri Venkateswara
- 116 ఏళ్ల వృద్ధురాలి సాహసం
- అలిపిరి మెట్లెక్కిన వైరల్ బామ్మ
- అచంచల శ్రీవారి భక్తి అద్భుతం
Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో భక్తికి వయసుతో నిమిత్తం లేదని నిరూపించింది ఒక అద్భుత ఘట్టం. కొండంత దేవుడిని దర్శించుకోవడానికి కొండలెక్కి వెళ్లడం ఒక ఎత్తయితే, నూరేళ్లు దాటిన వయసులో కాలినడకన ఆ స్వామి చెంతకు చేరడం భక్తి పరాకాష్టకు నిదర్శనం. ఆ అచంచల విశ్వాసమే 116 ఏళ్ల వయసులోనూ ఆ వృద్ధురాలిని అలిపిరి మెట్లపై నడిపించింది.
Kerala High Court: మోనాలిసా భోస్లే భర్తకు షాకిచ్చిన కేరళ హైకోర్టు.. బెయిల్ పొడిగింపునకు నిరాకరణ
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఒక వీడియో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తన కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి కాలిబాట గుండా కొండపైకి వెళ్తున్న ఈ బామ్మను చూసి స్థానికులు, ఇతర భక్తులు అబ్బురపడ్డారు. శారీరక బలహీనతలను సైతం పక్కనబెట్టి, కేవలం ఆ వేంకటేశ్వరస్వామిపై ఉన్న అపారమైన భక్తితోనే ఆమె అంతటి సాహస యాత్రకు పూనుకున్నారు.
సాధారణంగా యువకులే మెట్లు ఎక్కడానికి ఆయాసపడే ఈ రోజుల్లో, పండు ముసలి వయసులో ఆమె అలిపిరి(Tirumala) మార్గంలో నడుస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. భక్తి ఉంటే కొండలైనా దాటవచ్చని, భగవంతుడిపై నమ్మకమే మనిషికి నడవడానికి కావలసిన అసలైన శక్తిని ఇస్తుందని ఈ బామ్మ నిరూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె భక్తికి ముగ్ధులవుతూ “గోవిందా.. గోవిందా..” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
