Kerala High Court: మోనాలిసా భోస్లే భర్తకు షాకిచ్చిన కేరళ హైకోర్టు.. బెయిల్ పొడిగింపునకు నిరాకరణ
వైరల్ కుంభమేళా గర్ల్ మోనాలిసా భోస్లే భర్త ఫర్మాన్ ఖాన్‌కు సంబంధించిన చట్టపరమైన(Kerala High Court) వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Kerala High Court refuses to extend bail for Monalisa Bhosale husband Farman Khan.
- ఫర్మాన్ ఖాన్‌కు గట్టి షాక్
- బెయిల్ పొడిగింపునకు కోర్టు నో
- ముగిసిన హైకోర్టు అధికార పరిధి
Kerala High Court: వైరల్ కుంభమేళా గర్ల్ మోనాలిసా భోస్లే భర్త ఫర్మాన్ ఖాన్‌కు సంబంధించిన చట్టపరమైన వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన పోక్సో (POCSO) కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో కేరళ హైకోర్టు తీసుకున్న తాజా నిర్ణయం న్యాయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ట్రాన్సిట్ బెయిల్ పొడిగింపునకు కేరళ హైకోర్టు నిరాకరణ:
భర్త ఫర్మాన్ ఖాన్‌కు గతంలో మంజూరు చేసిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను పొడిగించేందుకు కేరళ హైకోర్టు నిరాకరించింది. జూలై 2, గురువారం నాడు కోర్టు(Kerala High Court) ఈ మేరకు స్పందిస్తూ, బెయిల్ గడువును పొడిగించాలంటూ ఫర్మాన్ దాఖలు చేసిన దరఖాస్తుకు చట్టబద్ధత లేదని తేల్చిచెప్పింది. మధ్యప్రదేశ్‌లోని సంబంధిత కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందేందుకు వీలుగా కేరళ హైకోర్టు జూన్ 3న ఫర్మాన్‌కు ఒక నెల రోజుల పాటు ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
పోక్సో కోర్టులో చుక్కెదురు.. సుప్రీం తీర్పుతో హైకోర్టు స్పష్టత:
అయితే, జూలై 1న మధ్యప్రదేశ్‌లోని మాండ్లేశ్వర్కు చెందిన అధికార పరిధి గల పోక్సో (POCSO) ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అక్కడ చట్టపరమైన ఊరట లభించకపోవడంతో ఆయన తిరిగి కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ప్రియా ఇండోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ కేసు తీర్పును ఉటంకించారు. “మీరు ఒకసారి అక్కడి కోర్టును ఆశ్రయించి, అనుకూలంగానైనా లేదా వ్యతిరేకంగానైనా ఆర్డర్ పొందిన తర్వాత, ఈ కోర్టు అధికార పరిధి ముగిసిపోతుంది” అని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తిరస్కరించారు.
