Adobe Techie Killed Case : ప్రముఖ కంపెనీలో ఉద్యోగం.. ఉదయం భార్యతో గొడవ.. సాయంత్రం మృతి.. సీసీ టీవీలో షాకింగ్ విషయాలు..
Delhi Adobe Techie Killed Case : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 31ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు.
Delhi Adobe Techie Killed Case
Delhi Adobe Techie Killed Case : ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 31ఏళ్ల సాప్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురయ్యాడు. ఉదయం భార్యతో జరిగిన గొడవ కారణంగా.. సాయంత్రం భార్య కుటుంబ సభ్యులు వచ్చి అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో అతను మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వినయ్ గుప్తా నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ Adobeలో పనిచేసేవాడు. ఆయనకు సుమారు రూ.60 లక్షల వార్షిక ప్యాకేజీ. మూడున్నరేళ్ల క్రితం రేఖతో వినయ్ గుప్తాకు వివాహం జరిగింది. నాలుగున్నర నెలల క్రితమే వారికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కవలలు జన్మించారు. గతంలో పలు సార్లు రేఖా, వినయ్ గుప్తా మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, శుక్రవారం ఉదయం వినయ్, రేఖకు మధ్య చిన్నారికి మందులు ఇవ్వండం విషయంలో గొడవ జరిగింది. ఆ తరువాత వినయ్ గుప్తా ఆఫీస్ కు వెళ్లాడు.
గొడవ గురించి రేఖ తమ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమె ఇద్దరు సోదరులు, సోదరి, తండ్రి, మామతోపాటు మరికొందరు ఇంటికి వచ్చారు. వినయ్ కుమార్ వచ్చేసరికి వారు ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో వినయ్ తల్లి కూడా ఇంట్లోనే ఉంది. వినయ్ కుమార్, రేఖ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ క్రమంలో రేఖ కుటుంబ సభ్యులు వినయ్ కుమార్ పై దాడి చేశారు. గొంతు నులిమి, ఛాతిపై కొట్టడంతో అతను మృతి చెందాడు.
మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. అందులో రేఖ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే దాడి జరిగినట్లు గుర్తించారు. దీంతో రేఖ, ఆమె ఇద్దరు సోదరులు, ఒక సోదరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
