Chiranjeevi Net Worth: మెగాస్టార్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు తెలుసా?
ఇన్ని దశాబ్దాల కెరీర్ లో ఆర్థికంగా కూడా తన ఆస్తుల విలువను పెంచుకున్నారు చిరంజీవి. (Chiranjeevi Net Worth)
Megastar Chiranjeevi Net Worth Properties Value
Megastar Chiranjeevi Net Worth: మెగాస్టార్ చిరంజీవి.. దాదాపు మూడు దశాబ్దాలు తెలుగు సినీ పరిశ్రమని ఏకచత్రాధిపత్యంగా ఏలిన హీరో. మధ్యలో పొలిటికల్ బ్రేక్ తీసుకున్నా ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 70 ఏళ్ళ వయసులో కూడా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నారు అభిమానుల కోసం.
ఆయన సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకోవడం, సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందికి అండగా నిలవడం చేసారు. ఇన్ని దశాబ్దాల కెరీర్ లో ఆర్థికంగా కూడా తన ఆస్తుల విలువను పెంచుకున్నారు చిరంజీవి.
Also See – Vangalapudi Anitha : కూతురితో కలిసి వరలక్ష్మి వ్రతంలో.. ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఫొటోలు..
ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్, GQ మరియు పలు నివేదికల ప్రకారం కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే దాదాపు 1650 కోట్ల విలువ చేసే స్థిర, చర ఆస్తులు ఉన్నట్టు సమాచారం. వాటిలో ముఖ్యంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో చిరంజీవికి 25,000 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉంది. ఆ ఇంటి విలువ దాదాపు 30 కోట్లు అని సమాచారం. వీటితో పాటు చెన్నైలో ఓ బిల్డింగ్, బెంగళూరులో ఫామ్ హౌస్ ఉంది. కోకాపేటలో వందల కోట్ల విలువ చేసే కొన్ని ఎకరాల భూమి ఉంది. దాంట్లో ప్రస్తుతం ఆచార్య సినిమాకు వేసిన సెట్స్ ఉంచి సినిమా షూటింగ్స్ కి అద్దెకు ఇస్తున్నారు. దాని నుంచి కూడా సంపాదన వస్తుంది.
ఇక చిరంజీవి దగ్గర ఖరీదైన కార్లు ఉన్నాయి. అయన వద్ద ఉన్న కార్లలో 4 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్, 2 కోట్ల విలువ చేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్, 10 కోట్ల విలువ చేసే రోల్స్ రాయ్స్, 3 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ కార్లు ముఖ్యమైనవి. ఇవే కాకుండా మరికొన్ని కార్లు కూడా ఉన్నాయి. చిరంజీవికి ప్రైవేట్ ఛాపర్ కూడా ఉందని సమాచారం. వీటితో పాటు పలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారు. ఇక ఒక్కో సినిమాకు చిరంజీవి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం. ఇటీవల యాడ్స్ కూడా చేస్తున్నారు. ఒక్కో యాడ్ కి 5 కోట్ల వరకు తీసుకుంటారని తెలుస్తుంది.
Also Read – Mega 158 : చిరు బర్త్ డే.. మెగా 158 టైటిల్ వచ్చేసింది.. గ్లింప్స్ అదిరిందిగా..
ఇవి కేవలం చిరంజీవి ఆస్తులు మాత్రమే. రామ్ చరణ్, తన కూతుళ్లు కూడా సినిమాలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ వారి ఆస్తులను సంపాదించుకుంటున్నారు.
