Mega 158 : చిరు బర్త్ డే.. మెగా 158 టైటిల్ వచ్చేసింది.. గ్లింప్స్ అదిరిందిగా..
Mega 158 Glimpse: మీరు కూడా మెగా 158 గ్లింప్స్ చూసేయండి..
Megastar Chiranjeevi Mega 158 Movie Title Glimpse Kaaka
Mega 158 Glimpse: మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాతో భారీ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో అంచనాలు పెంచారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగా 158 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
KVN ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ నారాయణ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. నేడు చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘కాకా’ అనే టైటిల్ ప్రకటించారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.
Also See – Megastar Chiranjeevi : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. చిరంజీవి రేర్ ఫొటోలు చూశారా..?
మీరు కూడా మెగా 158 గ్లింప్స్ చూసేయండి..
ఈ గ్లింప్స్ చూస్తుంటే.. రావులపాలెంలో సత్యం(చిరంజీవి) అందరితో మంచిగా అంటూ ఓ ఆక్వా కంపెనీలో సూపర్ వైజర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతని గురించి తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు, అతనికి కూతురు అంటే ప్రేమ ఉన్నట్టు చూపించారు. దీంతో భాష స్టైల్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాలోని చిక్ చిక్ చేలం.. సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
