AP Job Calendar: ఏపీలో నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్.. నాలుగు దశల్లో నియామకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల (AP Job Calendar)కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Ap government approves job calendar with 10060 vacancies
- 10,060 ప్రభుత్వ పోస్టుల భర్తీ
- ఏపీ జాబ్ క్యాలెండర్ ఆమోదం
- త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ల షెడ్యూల్
AP Job Calendar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు బిగ్ రిలీఫ్ ఇస్తూ జాబ్ క్యాలెండర్-2026(AP Job Calendar) ప్రకటనను అధికారికంగా విడుదల చేసింది (G.O.Ms.No.81, 22-08-2026). ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులకు స్పష్టతనిచ్చేలా ప్రత్యక్ష నియామక ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో (Phases) చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నోటిఫికేషన్ల దశలు, ఖాళీల వివరాలు:
ఇప్పటికే మొదటి దశ కింద 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, మిగిలిన మూడు దశల షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 15న రెండవ దశలో 3,231 పోస్టులు, అక్టోబర్ 15న మూడవ దశలో 2,311 పోస్టులు, అదే రోజున నాల్గవ దశ కింద మరొక 2,995 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ నియామకాలన్నీ APPSC, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, DSC వేదికలుగా జరగనున్నాయి.
కీలక శాఖల్లో ముఖ్యమైన పోస్టులు:
ఫేజ్-2 ద్వారా 149 గ్రూప్-1 పోస్టులు (డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్), 542 కానిస్టేబుల్, 182 ఎస్ఐ, 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫేజ్-3లో 200 డిప్యూటీ తహసీల్దార్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్, నీటి వనరుల శాఖలో 224 ఏఈఈ, విద్యుత్ సంస్థల్లో 629 ఏఈఈ పోస్టులు రానున్నాయి. ఇక చివరిగా ఫేజ్-4 ద్వారా 2,991 DSC టీచర్ పోస్టులను నింపనున్నారు. ఈ నియామకాలన్నీ రిజర్వేషన్లు, రోస్టర్ విధానాన్ని అనుసరించి పారదర్శకంగా జరుగుతాయని జీవోలో పేర్కొన్నారు.
