Janasena Local Elections : కూటమిలో లోకల్ టెన్షన్.. తగ్గేదేలే అంటున్న జనసేన..! సీట్ల సర్దుబాటు ఎలా?
Janasena Local Elections : ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఓ వైపు వైసీపీ అటాక్ మోడ్.. ఇంకోవైపు అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్సులు. ఇక రేపోమాపో నోటీఫికేషన్ రిలీజ్ అంటూ టాక్ నడుస్తున్న వేళ కూటమిలో సీట్ల పంపకాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. స్థానిక ఎన్నికలపై జనసేన ముందు నుంచి కాస్త సీరియస్‌గానే ఉంది.
Janasena Pawan Kalyan
Janasena Local Elections : ఏపీలో స్థానిక ఎన్నికల హీట్ మామూలుగా లేదు. ఓ వైపు వైసీపీ అటాక్ మోడ్.. ఇంకోవైపు అడ్మినిస్ట్రేషన్ క్లియరెన్సులు. ఇక రేపోమాపో నోటీఫికేషన్ రిలీజ్ అంటూ టాక్ నడుస్తున్న వేళ కూటమిలో సీట్ల పంపకాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. స్థానిక ఎన్నికలపై జనసేన ముందు నుంచి కాస్త సీరియస్‌గానే ఉంది. జనరల్ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి క్యాడర్, లీడర్లకు స్థానిక ఎన్నికలపై భరోసా ఇస్తూ వస్తున్నారు పవన్. అందుకు తగ్గట్లుగానే..సంస్థాగతం బలపడాలని భావిస్తున్న జనసేన లోకల్ బాడీ ఎన్నికలను అస్త్రంగా మల్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సారి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలతో పాటుమేయర్, జడ్పీ ఛైర్మన్ డైరెక్ట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని అనుకుంటోంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఇప్పుడు వర్తించదని తేల్చి చెబుతోంది.
Also Read : AE Nukaraju Family Case : ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో నిందితుడు?
అప్పటి పరిస్థితులను బట్టి 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలతోనే సరిపెట్టుకున్నాం. ఇప్పుడలా కుదరదు. ప్రాంతాల వారీగా, సామాజిక పరిస్థితులను బట్టి స్థానిక ఎన్నికల వ్యూహాలు ఉంటాయని పవన్ తేల్చి చెప్పారు. మంత్రి నాదండ్ల మనోహర్ మొదట స్థానిక సీట్లపై తమ పార్టీ స్టాండ్ ఏంటో తెనాలి జనసైనికులతో మీటింగ్‌లో స్పష్టం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా అదే మాటను చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా డిప్యూటీ సీఎం పవన్ కూడా తగ్గేదే లేదని వ్యాఖ్యలు చేయడంతో జనసేన మరింత పట్టుదలతో ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది
కూటమిలో మూడు పార్టీలు కలిసి పనిచేశాయి. జనరల్ ఎలక్షన్స్‌లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించాయి. ఆ తర్వాత కూడా టీడీపీ, జనసేన ఒకే స్టాండ్ మీద ఉంటూ వచ్చాయి. ఇప్పుడు కూడా ఆ ఇద్దరి లక్ష్యాలు ఒక్కటే అయినప్పటికీ.. స్థానిక ఎన్నికల సీట్ల విషయంలో మాత్రం జనసేన నో కాంప్రమైజ్ అంటోంది. దీంతో సర్దుబాటు పెద్ద సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి స్థానిక ఎన్నికలు, సీట్ల పంపకాలు హెడెక్గానే మారే ఛాన్సేసే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
2024 ఎన్నికల ఫార్ములా అన్నది అప్పుడున్న సిచ్యువేషన్స్కే పరిమితం అంటున్నారు జనసేన అధినేత పవన్. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వాటాను భారీగానే పెంచుకోవాలని అనుకుంటోంది జనసేన. క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్, లీడర్లలో ఎన్నో ఆశలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ఆ పార్టీకి చాలా ముఖ్యం కూడా. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావడానికి ఇది ఒక మంచి అవకాశం. లోకల్ ఫైట్‌లో పార్టీకి ఇంకా బలోపేతం అయితే..రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పెద్ద పునాది అవుతుందనేది జనసేన పెద్దల అంచనా. పైగా జనసేన కోసం, పవన్ కోసం..ఏళ్లుగా పనిచేస్తున్న క్యాడర్‌కు సరైన న్యాయం దక్కే అవకాశం కూడా ఇప్పుడే ఉంది. అందుకే స్థానిక ఎన్నికల సీట్లలో మేజర్ షేర్ కోరుకుంటోంది జనసేన.
లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీపై జనసేన లెక్కలు జనసేనకు ఉన్నాయంటున్నారు. తమకు కనీసం 15 నుంచి 20 శాతం ఓటు బ్యాంకు ఉంటుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. ఈ లెక్కనే ఇంకా బలపడేలా..స్థానిక ఎన్నికల్లో తమ సీటు బ్యాంకు పెరిగేలా సీట్లు దక్కించుకోవాలని ఆశిస్తున్నారట. 30శాతానికి పైగా సీట్లను కోరుతోందట జనసేన. టీడీపీకి 85శాతం, జనసేనకు 15శాతం, బీజేపీకి 5శాతం సీట్లు అనే ప్రపోజల్‌ను ఏ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదట. ఇక్కడే ఇంటర్నల్ డిస్కషన్స్‌లో ఓ అభిప్రాయానికి రాలేకపోయారని అంటున్నారు.
అయితే పవన్ పట్టుబడితే చంద్రబాబు కాదంటారా అన్న చర్చ ఉంది. అలా అని టీడీపీ క్యాడర్‌కు న్యాయం చేయకపోతే చంద్రబాబు కూడా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. సో చంద్రబాబు, పవన్ భేటీ అయి డిస్కస్ చేస్తే ఎలాంటి గొడవలు రాకుండా సీటు షేరింగ్ జరిగిపోతుందన్నది రెండు పార్టీల్లో జరుగుతున్న చర్చ. 2024 ఎన్నికల సీట్ల లెక్కను జనసేన ఎలాగూ ఒప్పుకోదు కాబట్టి టీడీపీ కూడా కొంత తగ్గి ఆలోచిస్తుందని అంటున్నారు. అయితే ఎక్కడ జనసేనకు ఎక్కువ బలం ఉంది.. గెలుపు అవకాశాలు ఉన్నాయన్నది ఎక్కడ ఆలోచించుకుని సీట్ల పంపకాలు జరుపుకుంటే సమస్య ఉండదని భావిస్తున్నారట. ఒకవేళ జనసేన కోరిన చోట టీడీపీ టికెట్లు కేటాయించకపోతే ఫ్రెండ్లీ కంటెస్టే ఫైనల్ ఆప్షన్‌గా మారే సిచ్యువేషన్ కనిపిస్తోంది.
