Traffic (1)
Hyderabad Traffic: మెట్రో సిటీ హైదరాబాద్ లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరమంతా జలమయమైంది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి. దారులన్నీ మూసుకుపోవడంతో ప్రజలు ఇళ్లకు చేరడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆగిపోయిన నీటిని క్లియర్ చేసేందుకు డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ టీమ్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో మ్యాన్ హోల్స్ వంటివి ఓపెన్ అయి ఉంటాయని గమనించి రోడ్డుపై ప్రయాణించాలని వాహనదారులకు, పాదచారులకు అధికారులు సూచిస్తున్నారు.