Musi River Catchment Area (Photo Credit : Google)
Hydra Next Target : మూసీ రివర్ బెడ్ లో 2వేలకు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఈ అక్రమ కట్టడాలను తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595 అక్రమ నిర్మాణాలను గుర్తించగా.. మల్కాజిగిరిలో 239, రంగారెడ్డి జిల్లాలో 332 అక్రమ నిర్మాణాలు గుర్తించారు. పునరావాసం కల్పించిన తర్వాతనే మూసీలో నిర్మాణాల తొలగింపు చర్యలు చేపట్టనున్నారు. రెండు మూడు రోజుల్లో నిర్వాసితుల సామాగ్రి తరలింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. అటు మూసీ నిర్వాసితులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో ఉండే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా.. హైడ్రా అధికారులు తర్వాత మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలోకి వెళ్లేందుకు మార్గం క్లియర్ అయ్యింది. మూసీలో రివర్ బెడ్ లో వెలసిన నిర్మాణాలు తొలగించేందుకు రెడీ అయ్యారు. అయితే, ముందుగా వారందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించే చర్యలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకంగా వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటయించే విధంగా జీవోను కూడా రిలీజ్ చేసింది.
రివర్ బెడ్ లో 2వేలకు పైగా అక్రమ నిర్మాణాలు వచ్చినట్లుగా గుర్తించారు. వారందరికి ఇళ్లు కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. వారిలో ఎవరికైనా పట్టా భూములు ఉంటే.. దానికి సంబంధించి ప్రత్యేకంగా జీవో ప్రకారం వారికి నష్ట పరిహారం కూడా ఇవ్వనున్నారు. ఇళ్లు నిర్మించుకుని, ఏళ్ల తరబడి అనేక అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అయితే, వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు జంట జలశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు.
Also Read : హైడ్రాపై పోరాటానికి బీజేపీ రెడీ.. హైడ్రా దూకుడును అడ్డుకునేలా వ్యూహం?
చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండే శంకర్ నగర్, మూసారం బాగ్ లోని కొన్ని బస్తీల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇళ్లలోకి నీరు చేరుతున్న పరిస్థితి ఉంది. అయితే, మూసీ నుంచి 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. బఫర్ జోన్, రివర్ బెడ్ లోనూ ఉండే ఇళ్లు అన్నింటినీ తొలగించనున్నారు. ఆ తర్వాత మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో వరదలు ముంచెత్తినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా.. ఈ పనులు చేస్తున్నట్లు రేవంత్ సర్కార్ తెలిపింది.