×
Ad

Ibrahimpatnam: చిన్నారి ఆద్య సేఫ్.. తప్పిపోయిన 30 నిమిషాల్లోనే కనిపెట్టిన ఇబ్రహీంపట్నం పోలీసులు

బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మరుక్షణమే రంగంలోకి దిగారు.

  • Published On : February 27, 2026 / 06:40 PM IST

Ibrahimpatnam Police

  • ఆడుకుంటూ తప్పిపోయన ఏడేళ్ల చిన్నారి
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన పోలీసులు
  • అర గంటలోనే చిన్నారిని కనిపెట్టిన పోలీసులు

 

Ibrahimpatnam: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో చిన్నారి కథ సుఖాంతమైంది. తప్పిపోయిన అర గంటలోనే పోలీసులు చిన్నారిని కనిపెట్టారు. కేవలం 30 నిమిషాల్లోనే ఏడేళ్ల పాపను సురక్షితంగా కాపాడారు. నిజామాబాద్ జిల్లా చిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన అంజలి-రాజు దంపతులు తమ ఏడేళ్ల పాప ఆద్యతో కలిసి బంధువులను చూసేందుకు ఇబ్రహీంపట్నం వచ్చారు. హాస్టల్ దగ్గర ఆడుకుంటున్న ఆద్య దారి తప్పింది. ఎటో వెళ్లిపోయింది.

బిడ్డ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మరుక్షణమే రంగంలోకి దిగారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వారి ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చింది.

అర గంటలోనే చిన్నారిని సురక్షితంగా కనిపెట్టారు. పాపను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. తమ పాప సురక్షితంగా తిరిగి తమ దగ్గరకు చేరడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. మెరుపు వేగంతో స్పందించి పాపను సేఫ్ గా తమ దగ్గరికి చేర్చిన ఇబ్రహీంపట్నం పోలీసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి పేరెంట్స్.

Also Read: కంటెంట్ క్రియేటర్లకు పండగే.. మీ మొబైల్‌తోనే హై-క్వాలిటీ మూవీ షాట్స్ తీయొచ్చు.. టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు మీకోసం..!