Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు IMD బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశం.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు (Heavy Rain Alert)కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
- V Santhosh Kumar
- Published on- November 12, 2026 / 10:32 PM IST
imd weather alert for ap and telangana low pressure likely in bay of bengal rains after november 15
Heavy Rain Alert: గత కొద్ది రోజులుగా తుఫానులు, భారీ వర్షాలతో వణికిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రస్తుతానికి కాస్త ఊరట లభించి పొడి వాతావరణం నెలకొంది. అయితే బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (Heavy Rain Alert) కీలక అంచనాలను విడుదల చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నవంబర్ 13, 14 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 15, 16 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
YS Jagan: చంద్రబాబు అభివృద్ధి ప్రచారంపై జగన్ ఫైర్.. కాగ్, APERC గణాంకాలతో విమర్శలు
ఏపీలో నవంబర్ 15 వరకు పొడి వాతావరణం.. మత్స్యకారులు, రైతులకు సూచనలు:
విశాఖపట్నం వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 15 వరకు వర్ష సూచనలు లేవు. తీర ప్రాంత మత్స్యకారులకు ఎలాంటి హెచ్చరికలు లేనప్పటికీ, అండమాన్ సముద్ర ప్రాంతంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున అటువైపు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కోతకు వచ్చిన పంటలు ఉన్న రైతులు నవంబర్ 15 తర్వాత జారీ అయ్యే వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణలో ప్రస్తుతానికి ప్రశాంతం.. మూడో వారంలో వర్షాలకు ఛాన్స్:
మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, నిజామాబాద్ సహా అన్ని జిల్లాల్లో నవంబర్ 15 వరకు పొడి వాతావరణమే కొనసాగనుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం గమనాన్ని బట్టి నవంబర్ మూడో వారంలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
