Komatireddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణకు సాధ్యం కాని హామీలు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎల్బీ నగర్ ప్రజలు అక్కడి నుండి పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నా తన మనసు మునుగోడు మీదే ఉందని తెలిపారు. తన రాజీనామా ద్వారానే మునుగోడు ఈ రోజు అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
- bheemraj
- Published On : October 16, 2023 / 03:39 PM IST
Komatireddy Raj Gopal Reddy
Komatireddy – BRS and Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కాని వాటిని మేనిఫెస్టోలో పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించడం బీజేపీతోనే సాధ్యం అన్నారు. మునుగోడు బై ఎన్నికల్లో ఓడినా నైతిక విజయం బీజేపీదే, రాజగోపాల్ రెడ్డి దేనని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో తన ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి రాజకీయ స్వార్థం కోసం రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. ఓడిన బాధ కంటే తనపై మచ్చ వేసినందుకు బాధగా ఉందన్నారు.
Talasani Srinivas : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి విపక్షాలకు దిమ్మ తిరిగింది : మంత్రి తలసాని
ఎల్బీ నగర్ ప్రజలు అక్కడి నుండి పోటీ చేయాలని ప్రతిపాదిస్తున్నా తన మనసు మునుగోడు మీదే ఉందని తెలిపారు. తన రాజీనామా ద్వారానే మునుగోడు ఈ రోజు అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తన తుది శ్వాస వరకు మునుగోడు ప్రజల కోసమే పని చేస్తానని చెప్పారు. నరేంద్ర మోదీ హయాంలో ప్రపంచంలోనే పెద్ద దేశంగా భారత్ నడుస్తుందన్నారు.
