TS Inter Result: నేడు ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..
ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు మంత్రి వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
- Harishth Thanniru
- Published On : June 28, 2022 / 06:55 AM IST
Inter Results
TS Inter Result: ఇంటర్మీడియట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11గంటలకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు మంత్రి వెల్లడిస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
Intermediate: 26న తెలంగాణ ఇంటర్ ఫలితాల వెల్లడి?.. 30లోగా ‘పది’ ఫలితాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది మే 6 నుంచి 24వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్షలను 1,443 పరీక్షా కేంద్రాల్లో అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4.64 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ద్వితీయ సంవత్సరంలో 4.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు.
ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ అధికారులు పలు వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచనున్నారు.
https://tsbie.cgg.gov.in
https://results.cgg.gov.in
https://examresults.ts.nic.in
