Ts Bjp
BJP New rule : తెలంగాణ బీజేపీలో.. రోజుకో రచ్చపై.. చర్చ నడుస్తోంది. జిల్లాలు చుట్టేద్దామనుకున్న స్టేట్ లెవెల్ నాయకులకు.. చుక్కెదురవుతోంది. రాష్ట్ర స్థాయి నేతలు.. జిల్లా పర్యటనలు చేయాలంటే.. ఆ జిల్లా అధ్యక్షుల అనుమతి తప్పనిసరి అంటోంది రాష్ట్ర నాయకత్వం. దీంతో.. స్టేట్ లెవెల్ లీడర్‌గా కొనసాగుతూ.. జిల్లా స్థాయి నాయకుడి పర్మిషన్ తీసుకోవడమేంటని.. తెగ ఫీలైపోతున్నారు బడా లీడర్లు.
బీజేపీ నేతల జిల్లా టూర్లు పార్టీలో అంతర్గత విబేధాలకు దారితీస్తున్నాయని.. స్టేట్ ఆఫీసులో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర స్థాయి నేతలు జిల్లా పర్యటనల్లో భాగంగా హాజరవుతున్న కార్యక్రమాలు, చేస్తున్న పనులు.. జిల్లా అధ్యక్షులకు తలనొప్పిగా మారిందట. చుట్టపు చూపుగా వచ్చి.. హడావుడి చేసి వెళ్లిపోయాక.. తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. రాష్ట్ర నాయకత్వం దృష్టికి తెచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అయితే.. కింది స్థాయి నేతల ఆహ్వానం మేరకే.. తాము జిల్లాలకు వెళుతున్నామని.. స్టేట్ లీడర్లు చెబుతున్నా.. దాని వెనుక కథ వేరే ఉందని.. పార్టీ ఆఫీసులో టాక్ నడుస్తోంది.
Also read : Telangana : రాహుల్ TS టూర్..కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మీటింగ్ ను లెక్కచేయని కాంగ్రెస్ నేతలు..!
జిల్లాల్లో.. పార్టీ కార్యక్రమాలేవీ లేకపోయినా.. ఏదో ఒక ప్రైవేట్ ప్రోగ్రాం పేరుతో.. జిల్లాలను చుట్టేయాలని కొందరు నేతలు భావిస్తున్నట్లు.. కాషాయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయ్. అలా.. జిల్లాల్లో వారు చేసే పనులు.. జిల్లా అధ్యక్షులకు తెలియకపోవడం, తర్వాత.. పార్టీపరంగా అక్కడేదో ఇబ్బందులు తలెత్తడం.. వాటికి.. జిల్లా అధ్యక్షులుగా తాము సమాధానం చెప్పాల్సి రావడంపై.. తెగ బాధపడిపోతున్నారని.. కార్యకర్తల్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. కొందరు జిల్లా స్థాయి నేతలు, జిల్లాల్లో ఉండే రాష్ట్ర స్థాయి నాయకులు.. తమ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు.. ఏదో ఓ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటికి.. తమకు అనుకూలంగా ఉన్న స్టేట్ లెవెల్ లీడర్లకు ఆహ్వానం పంపుతున్నారు. ఇదే.. జిల్లా అధ్యక్షులకు తలనొప్పి తెస్తోందన్న.. చర్చ మొదలైంది.
ఇటీవల.. వరంగల్ జిల్లాలో ఓ నేత శివరాత్రి రోజు భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేని ఆహ్వానించడం.. దానిపై స్థానిక జిల్లా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం.. వివరణ కోరడం.. సదరు నేతలు షోకాజ్ నోటీలివ్వడం.. అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయ్. దీనికి సంబంధించి.. ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేని పిలిస్తే తప్పేంటని.. ఆ బీజేపీ నేత సమర్ధించుకున్నాడట.
Also read : Minister KTR: గుడి, మసీదు, చర్చి కూడా కడతాం – కేటీఆర్
కొద్ది రోజుల క్రితమే.. బండి సంజయ్ కూడా షాద్‌నగర్‌లో ఓ బీజేపీ నేత తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ విషయం.. రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండానే బండి సంజయ్ షాద్‌నగర్‌లో పర్యటించారు. దీంతో.. ఆ జిల్లా ప్రెసిడెంట్‌కి.. సారీ కూడా చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. మరోసారి.. ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చారని తెలుస్తోంది.
అంతేకాదు.. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలంతా.. జిల్లా అధ్యక్షులకు సమాచారం ఇచ్చాకే.. జిల్లాల్లో పర్యటించాలని.. ఇటీవల జరిగిన ముఖ్య నేతల సమావేశంలో సూచించారు బండి సంజయ్. ఇలా చెప్పడానికి వేరే కారణముంది. రాష్ట్ర స్థాయి నేతలు.. తమ జిల్లా పర్యటనల్లో.. ఇతర పార్టీల నేతలకు బీజేపీ కండువా కప్పి.. కాషాయ తీర్థం అందిస్తున్నారు. అలా చేరేవాళ్లలో కొందరికి.. జిల్లా అధ్యక్షులతో పడకపోవడం, గతంలో పార్టీలో చేర్చుకోవద్దని బ్లాక్ లిస్టులో పెట్టిన వాళ్లు కూడా ఉంటున్నారని.. రాష్ట్ర నాయకత్వం దృష్టికి వచ్చింది. అందువల్ల.. జిల్లా టూర్లు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలన్నీ.. జిల్లా అధ్యక్షుడి కనుసన్నల్లోనే జరగాలని ఆదేశించారు. చేరికలు కూడా జిల్లా అధ్యక్షులకు తెలిసే జరగాలని కుండ బద్దలు కొట్టేశారట. దీంతో.. పార్టీ ఆఫీస్ వర్గాలు కొత్త కుండ కొన్నట్లు తెలుస్తోంది.
Also read : Harish Rao On DalitBandhu : త్వరలో అన్ని వర్గాలకు దళితబంధు-హరీశ్ రావు
ఎందుకన్నా.. ఇలాంటి నిర్ణయాలు.? ఇప్పుడు అవసరమా మనకివన్నీ.. అని ఓ లీడర్ అడిగితే.. పార్టీలో ఒక్కటి తక్కువైంది అనే డైలాగ్ వినిపించినట్లు కొందరు చెబుతున్నారు. అదే.. క్రమశిక్షణ. పార్టీని క్రమశిక్షణతో నడిపించేందుకే.. ఇలాండి కంఢీషన్స్ పెడుతున్నట్లు రాష్ట్ర నాయకత్వం చెబుతున్నా.. ఇది కొందరు నాయకులు రెగ్యులర్‌గా వేస్తున్న జిల్లా టూర్లను కట్టడి చేసేందుకేనని.. పార్టీ కార్యకర్తల్లో చర్చ నడుస్తోంది.