Jagga Reddy: తెలంగాణలో కాంగ్రెస్ టార్గెట్ ఇదే..: జగ్గారెడ్డి

Jagga Reddy

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని కానివ్వకూడదన్న లక్ష్యంతో బీఆర్ఎస్, బీజేపీ పనిచేస్తున్నాయని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే తమ టార్గెట్ అని చెప్పారు.

దీన్ని అడ్డుకోవడానికే బీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మళ్లీ నోటీసులు రావడంపై జగ్గారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. కవితను నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.

లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని బండి సంజయ్ చెప్పారని, మరి ఏమైందని జగ్గారెడ్డి నిలదీశారు. ఇప్పుడు కవితకు నోటీసుల విషయం కూడా అంతా డ్రామానే అని చెప్పారు.

రాహుల్ అంటే తనకు పిచ్చి అని, గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం తాను నిర్విరామంగా పనిచేస్తానని తెలిపారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించింది తెలంగాణపై ప్రేమతో కాదని, రాజకీయం కోసమేనని అన్నారు. అప్పట్లో తన ధైర్యం చూసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు

Read Also:  సముద్రంలో మునిగి పురాతన ద్వారకలో పూజలు చేసిన ప్రధాని మోదీ .. ఫొటోలు వైరల్

ట్రెండింగ్ వార్తలు