Telangana Politics : తెలంగాణలో బీజేపీ, జనసేనది పొత్తా.? ఒంటరి పోరేనా.? అభ్యర్థి ప్రకటన వెనుక ఎత్తుగడ ఉందా.?

Telangana Politics : బీజేపీ, జనసేన తీరు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కూటమి పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణకు వచ్చేసరికి అలయన్స్ ఉంటుందా.? ఉండదా.? అంటే కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా ఇండికేషన్స్ పంపిస్తున్నాయి.

Janasena Party and BJP Politics in telangana

Telangana Politics : బీజేపీ, జనసేన తీరు పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో కూటమి పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణకు వచ్చేసరికి అలయన్స్ ఉంటుందా.? ఉండదా.? అంటే కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా ఇండికేషన్స్ పంపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్రావు జనసేనతో పొత్తు ఉండదని ప్రకటించారు. ఇప్పుడు జనసేన కూడా అలాంటి సంకేతం పంపించేలా ఓ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించి చర్చకు దారితీసింది. ఖమ్మం, వరంగల్, నల్లొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ గడల శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది జనసేన. దీంతో మహబూబ్‌నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటులో పోటీ మాటేంటన్న చర్చ మొదలైంది.

Also Read : Karnataka : కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. ఉమ్మెత్త పండ్ల ఎఫెక్ట్.. అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్‌‌లకు బిగ్‌షాక్..

మహబూబ్‌నగర్, హైదరాబాద్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీలో టికెట్ కోసం పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. దాదాపు పది మంది నేతలు టికెట్ ఆశిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, సీనియర్ నేత ప్రకాశ్ రెడ్డి, సారంగుల అమర్నాథ్, ఎస్.మల్లారెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్, శ్రీవర్థర్ రెడ్డి సహా పలువురు పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం బీజేపీలో ఇప్పటివరకు అంతగా పోటీ కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జనసేన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

కేంద్రంలో ఎన్డీఏలో కలిసి ఉన్న బీజేపీ, జనసేన… తెలంగాణలో మాత్రం వేర్వేరుగా పోటీ చేస్తాయా..? ఒకవైపు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ చెబుతుండగా.. జనసేన ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం వెనుక వ్యూహం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రెండు పార్టీలు నిజంగానే బరిలోకి దిగితే.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం లేకపోవడానికి రీజనేంటన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ సీటు కోసం బీజేపీలో పోటీ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఆ సీటును జనసేనకు వదిలేసి.. మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి స్థానంలో బీజేపీ బరిలోకి దిగుతుందా..? అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. జనసేన అభ్యర్థి ప్రకటన కేవలం పార్టీ విస్తరణలో భాగమా..? లేక బీజేపీతో తెరవెనుక సీట్ల సర్దుబాటుకు ముందే వేసిన రాజకీయ ఎత్తుగడా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

జనసేన దూకుడు బీజేపీని ఇబ్బందులు గురి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ప్రకటించి జనసేన ఒక అడుగు ముందే వేసింది. దీంతో బీజేపీ, జనసేన మధ్య పోరు ఖాయమా.? లేక పొత్తు కుదురుతుందా.? అన్న చర్చ ఇంట్రెస్టింగ్గా మారింది. అసలు ఎన్డీఏ మిత్రులు ప్రత్యర్థులవుతారా.? లేక రెండు స్థానాలను పంచుకొని ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతారా..? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న మారింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కాని..బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందా.? లేక ఒంటరి పోరేనా అనేది క్లారిటీ రానుంది.