Barrelakka: బర్రెలక్కకే మా మద్దతు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్

బర్రెలక్కకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తుంది. పలువురు ప్రముఖులు ఆమెకు అండగా ఉంటామని ముందుకు వస్తున్నారు.

Barrelakka

KA Paul Support to Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్నేళ్ల క్రితం గేదెలు కాస్తూ ఆమె తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రావడం లేదంటూ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది. తనదైన రీతిలో ప్రచారంలో ముందుకు సాగుతూ ఓటర్లను శిరీష ఆకర్షిస్తున్నారు. ఇటీవల జరిగిన దాడితో ఆమె పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఈ క్రమంలో తనకు భద్రత కల్పించాలని ఆమె హైకోర్టును సైతం ఆశ్రయించింది.

కేఏ పాల్ మద్దతు..
బర్రెలక్కకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మద్దతు లభిస్తుంది. పలువురు ప్రముఖులు ఆమెకు అండగా ఉంటామని ముందుకు వస్తున్నారు. నిరుద్యోగుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. కేవలం యువతనుంచే కాకుండా.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ లాంటి రాజకీయ ప్రముఖులతో పాటు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు బర్రెలక్కకు మద్దతు తెలిపారు. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ పాల్ బర్రెలక్కకు మద్దతు తెలిపాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటు వేయకుండా ఇంట్లోనైనా కూర్చోండి.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మాత్రం ఓటు వేయొద్దని ఓటర్లను కోరారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మా మద్దతు బర్రెలక్కకు ఉంటుందని, ఆమెకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.

Also Read : Revanth Reddy : తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. అమిత్ షా, కేసీఆర్ కామన్ ప్లాన్ అర్థం చేసుకోవాలని సూచన

హైకోర్టును ఆశ్రయించిన బర్రెలక్క ..
గత మూడు రోజుల క్రితం బర్రెలక్కపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు రక్షణ కల్పించాలని కోరుతూ బర్రెలక్క శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనకు 2ప్లస్2 భద్రత కావాలని పిటీషన్ లో బర్రెలక్క హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోనివ్వడం లేదని బర్రెలక్క పేర్కొంది. పిటీషన్ పై మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

Also Read : Gangula Kamalakar : ఆంధ్రోళ్లు మళ్లీ వస్తున్నారు.. షర్మిల, పవన్, పాల్‌పై గంగుల సంచలన వ్యాఖ్యలు

 

 

ట్రెండింగ్ వార్తలు