Farmers’ Concern Kamareddy Collector : కామారెడ్డి అన్నదాతల ఆందోళనపై స్పందించిన కలెక్టర్.. రైతుల భూములు ఎక్కడికీ పోవు

రైతుల ఆందోళనపై కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు.

COLLECTOR

Farmers’ Concern Kamareddy Collector : రైతుల ఆందోళనపై కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతుల భూములు ఎక్కడికీ పోవని స్పష్టం చేశారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ మాత్రమే ఇచ్చామని తెలిపారు. ఇంకా మాస్టర్ ప్లాన్ ఆమోదం పొందలేదని పేర్కొన్నారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలుంటే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సూచించారు.

రైతులను కొంతమంది తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రైతులతో చర్చించేందుకు తాను అందుబాటులో ఉంటానని వెల్లడించారు. అయితే 10 మంది రైతులు వచ్చి కలిసేందుకు తనకు ఎలాంటా అభ్యంతరం లేదన్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు.

Kamareddy Collectorate High Tension : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద హైటెన్షన్.. గేటు తాళం పగలగొట్టి కార్యాలయంలోకి దూసుకెళ్లిన రైతులు

అంతకముందు కామారెడ్డి రైతుల ఆందోళనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉందన్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు మున్సిపల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టి అభివృద్ధి పనులు చేయాలనుకోవడం లేదని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని చెప్పారు.

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాస్టర్ ప్లాన్ తో భూములు కోల్పోతున్నామంటూ రైతులు ఆందోళన చేపట్టారు. మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టరేట్ గేట్ తాళం పగలగొట్టి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అధికారులు వేసిన తాళం పగలగొట్టి రైతులు కలెక్టరేట్ లోనికి వెళ్లారు.

Minister KTR Respond : కామారెడ్డి రైతుల ఆందోళనలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. అందరికీ ఆమోదయోగ్యంగా మాస్టర్ ప్లాన్

పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. తోపులాటలో పలువురు రైతులకు గాయలు అయ్యాయి. స్వామి అనే రైతు స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా మారింది.