Hyderabad : అబ్దుల్లా ఫైజర్ చేతిలో జెరీనా బేగం మోసపోయిందా?
ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
- kunduru Vinod
- Published On : November 30, 2021 / 03:00 PM IST
Hyderabad
Hyderabad : ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండకు చెందిన 25 ఏళ్ల జెరీనా బేగం బ్యూటిషియన్‌గా పనిచేస్తుంది. 2019లో ఈమెకు కరీంనగర్‌కు చెందిన మొహ్మద్ అబ్దుల్లా ఫైజర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి జెరీనాను కలిసేవాడు ఫైజర్.
చదవండి : Old City: పాతబస్తీలో గ్యాంగ్ వార్
పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఫైజర్‌ను కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది జెరీనా. యువతి కుటుంబ సభ్యులతో మంచిగా పరిచయం పెంచుకున్నాడు ఫైజర్.. ఈ క్రమంలోనే తనకు అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చిందని.. కొద్దీ రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి రూ.2.50లక్షలు తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వలేదు.
చదవండి : Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!
ఇదే సమయంలో యువతి పెళ్లి ప్రస్తావన తేగా.. తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఇటీవల యువతితో మాట్లాడటం మానేశాడు. ఫోన్ చేసినా తీయకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
