Karnataka Government
Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాలకు వచ్చే సమయంలో తగిన దుస్తులు మాత్రమే ధరించాలని సూచించింది. బిగుతు దుస్తులతో ఆఫీసులకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : supreme court : మీ భార్యను ఖర్చుల లెక్కలు అడుగుతున్నారా..? ఒక్కసారి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ చూడండి..
చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్, బిగుతైన దుస్తులతో కార్యాలయాలకు రావొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధి నిర్వహణలో హుందాగా కనిపించేలా దుస్తులు ధరించాలని గతంలో సూచనలు చేసినా పట్టించుకోని కారణంగానే.. తాజాగా ప్రత్యేక ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ (డీపీఎఆర్) విభాగం నుంచి వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, కమిషనర్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, అదననపు ముఖ్య కార్యదర్శులు, జడ్పీ సీఈవోలకు ఉత్తర్వులు పంపారు.
ప్రభుత్వ ఉత్తర్వులను కర్ణాటక ప్రభుత్వం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీఎస్ షడాక్షరి స్వాగతించారు. అయితే, ఇటీవల యువ ఉద్యోగులు చిరిగిన జీన్స్, బిగుతైన దుస్తులతో విధులకు వస్తున్నారని, ఇది అసభ్యకరంగా కనిపిస్తోందని ఓ అధికారి అన్నారు.
మరోవైపు.. ఈ సర్క్యులర్లోనే మరికొన్ని నిబంధనలను కర్ణాటక ప్రభుత్వం చేర్చింది. ఉదయం 10.10 గంటలకల్లా కార్యాలయంలో ఉండాలని, అధికారిక పనిమీద బయటకు వెళ్తే ఆ వివరాలను రిజిస్ట్రర్ లో నమోదు చేయాలని సూచించింది. ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరిగా రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాదు.. కార్యాలయాలకు వచ్చే సమయంలో, వెళ్లే సమయంలో నగదు వివరాలను క్యాష్ డిక్లరేషన్ రిజిస్టర్ లో నమోదు చేయాలని కూడా సూచించారు.