Sankranti Special Trains: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? గుడ్‌న్యూస్.. ఏకంగా 600 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే..
రిజర్వేషన్ ఓపెన్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే ఫుల్ అయిపోతున్నాయి. డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నాం.
Sankranti Special Trains: తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ ఫెస్టివల్ వస్తోందంటే సందడి మామూలుగా ఉండదు. సంక్రాంతి కోసం తెలుగు వారంతా సొంతూళ్లకు బయలుదేరుతారు. చదువు కోసం, జాబ్ కోసం వేరే ఊళ్లలో ఉన్న వారంతా ఇంటి బాట పడతారు. కుటుంబసభ్యులు, స్నేహితులు మధ్య పండుగను జరుపుకోవాలని ఆరాటపడతారు. అందుకే, ఏ మూలన ఉన్నా పండక్కి ఇంటికి చేరుకోవాలని చూస్తారు. వీరిలో ఎక్కువ శాతం రైళ్లనే ఆశ్రయిస్తారు. ట్రైన్ జర్నీకి మొగ్గు చూపిస్తారు.
అందుకే, వీలైనంత ముందుగానే రైల్లో బెర్తులు రిజర్వేషన్ చేసుకుంటారు. ఈ కారణంగా సంక్రాంతి పండుగ సీజన్ లో రైళ్లకు భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అయితే, తగినన్ని రైళ్లు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. సంక్రాంతి పండక్కి ప్రత్యేక రైళ్లు నడిపిస్తోంది.
ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ కీలక వివరాలు వెల్లడించారు. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 124 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోందన్నారు. సికింద్రాబాద్, చర్లపల్లి, లింగంపల్లి, కాచిగూడ, నాంపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. అంతేకాదు ఈ సీజన్ మొత్తంలో సుమారు 600కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. డిమాండ్‌కు అనుగుణంగా మరిన్ని రైళ్లను నడిపిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ స్పష్టం చేశారు.
సంక్రాంతి సందర్భంగా ఎప్పటిలానే రెండు మూడు నెలల ముందే స్పెషల్ ట్రైన్స్ కి ప్లాన్ చేస్తాం. ఈసారి కూడా 124 రైళ్లను ఇప్పటికే ప్రకటించాం. ఇవన్నీ కూడా జంట నగరాల నుంచి కోస్టల్ ఏరియా వైపు అంటే విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్, అనకాపల్లి వెళ్లేందుకు ప్లాన్ చేశాం. 124 రైళ్లతో పాటు అదనంగా నడిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. డిమాండ్ ఎక్కువగానే ఉంది. రిజర్వేషన్ ఓపెన్ అయిన ఒకటి రెండు రోజుల్లోనే ఫుల్ అయిపోతున్నాయి.
600లకు పైగా స్పెషల్ రైళ్లు..
డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేస్తున్నాం. ముందు ముందు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలకు రైళ్లను ఎక్స్‌టెండ్ చేశాం. దాదాపుగా 600లకు పైగా స్పెషల్ రైళ్లను పండుగ సందర్భంగా రన్ చేయబోతున్నాం. ఒక్క రైల్లో దాదాపు 1500 మంది నుంచి 2వేల మంది వరకు ప్రయాణికులు ట్రావెల్ చేస్తుంటారు. ఈ అంచనా ప్రకారం రైళ్లను ప్లాన్ చేయడం జరిగింది. గత ఏడాది 450 నుంచి 500 వరకు రైళ్లు నడిపాము. ఈసారి 600లకుపైగా రైళ్లు నడిపేందుకు ప్లాన్ చేశాం. డిమాండ్ కు అనుగుణంగా మరిన్ని రైళ్లు నడిపేందుకు ప్రణాళిక చేస్తున్నాం. ఒక స్పెషల్ ట్రైన్ వేయాలంటే దాని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చాలా డిపార్ట్ మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి” అని దక్షిణ మధ్య రైల్వే CPRO శ్రీధర్ తెలిపారు.
Also Read: రాంగ్ రూట్‌లో వెళ్తున్నారా? ఇక నుంచి మీకు ఉంటది..! పట్టుబడితే
