Cm Revanth Reddy: వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్.. ఇక గ్రేటర్ పీఠంపైనే సీఎం గురి? వ్యూహం ఇదేనా..!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 300 డివిజ‌న్లు కానున్నాయి. ఈ డివిజ‌న్ల‌ ఏర్పాటు కూడా తుది ద‌శ‌కు చేరుకుంది.

Cm Revanth Reddy: వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్.. ఇక గ్రేటర్ పీఠంపైనే సీఎం గురి? వ్యూహం ఇదేనా..!

Updated On : December 20, 2025 / 11:05 PM IST

Cm Revanth Reddy: పంచాయతీ ఎన్నిక‌ల్లో పాజిటివ్‌ రిజల్ట్స్ సాధించాం. ఆల్రెడీ జూబ్లీహిల్స్‌ గెలుపు బూస్టప్‌ ఇవ్వనే ఇచ్చింది. ఇదే ఊపుతో దూసుకెళ్లడమే అంటోంది అధికార కాంగ్రెస్. నెక్ట్స్ గ్రేట‌ర్‌లో పాగా వేయడమే టార్గెట్‌గా వ్యూహాలకు పదును పెడుతున్నారట సీఎం రేవంత్. అందుకోసం ప‌క్కాగా పొలిటిక‌ల్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఎంపీటీసీ, జడ్పీటీసీ పోల్స్ ఇప్పట్లో లేనట్లేనా? ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లడం ఖాయమా? గ్రేటర్ పీఠంపైనే సీఎం గురి పెట్టారా?

సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు గేర్‌ మారుస్తున్నారు. జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌ వరకు కాస్త స్లోగా..నెమ్మదిగా వెళ్లినట్లు కనిపించిన ముఖ్యమంత్రి..ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఫుల్‌ స్పీడ్‌లో దూసుకెళ్తున్నారు. వెంటనే పంచాయతీ ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి మూడు విడతల్లో పల్లెపోరును కంప్లీట్ చేశారు. మెజార్టీ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుని ఇంకా ఫుల్‌ జోష్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో రాజకీయంగా వేగంగా పావులు క‌దుపుతున్నారు. పొలిటికల్ ఈక్వేషన్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంటూ..ఒక్కో స్టెప్ ముందుకేస్తున్నారు.

గ్రేటర్‌లో పాగా వేసేలా కాంగ్రెస్ పావులు..

పంచాయ‌తీ ఎన్నిక‌ల గెలుపుతో..గ్రేటర్‌ ఎన్నికలపై దృష్టి పెట్టారట సీఎం. తెలంగాణ‌కు ఆర్థికంగానే కాదు.. రాజ‌కీయంగా కూడా..హైద‌రాబాద్ గుండె లాంటిది. అయితే హైద‌రాబాద్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క అసెంబ్లీని కూడా గెలువ‌లేక‌పోయింది కాంగ్రెస్‌. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..ఎమ్మెల్యేల మ‌ర‌ణంతో వ‌చ్చిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి..గ్రేటర్‌లో రెండు సీట్లను తమ ఖాతాలో వేసుకోగలిగింది హస్తం పార్టీ. అటు పంచాయతీ పోల్స్‌, ఇటు రెండు బైఎలక్షన్లలో గెలుపు..ఇదే ఊపుతో గ్రేటర్‌లో పాగా వేసేలా పావులు కదుపుతోంది కాంగ్రెస్ పార్టీ.

డివిజ‌న్ల ఏర్పాటు పూర్తవ‌గానే.. రిజ‌ర్వేష‌న్ ప్రక్రియ‌ను పూర్తి చేసి..ఎన్నిక‌ల‌కు..

రేవంత్ రెడ్డి ఇప్పటినుంచే గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై ఫోకస్ పెట్టార‌ట‌. జీహెఎంసీలో ప్రస్తుతం 150 డివిజ‌న్లున్నాయి. అయితే పెరుగ‌తున్న జ‌నాభా..న‌గ‌ర విస్తర‌ణ‌.. ఇప్పటికే మెర్జ్ అయిన మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది రేవంత్ స‌ర్కార్. ఔటర్‌ రింగ్‌ రోడ్ వరకు..గ్రేట‌ర్‌ను విస్తరించాల‌ని డిసైడ్ చేసింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 300 డివిజ‌న్లు కానున్నాయి. ఈ డివిజ‌న్ల‌ ఏర్పాటు కూడా తుది ద‌శ‌కు చేరుకుంది. డివిజ‌న్ల ఏర్పాటు పూర్తవ‌గానే..రిజ‌ర్వేష‌న్ ప్రక్రియ‌ను పూర్తిచేసి..ఎన్నిక‌ల‌కు వెళ్లాలనేది రేవంత్ రెడ్డి ఫ్యూహం అంటున్నారు.

ఇంతలోపు గ్రేట‌ర్ అభివృద్ధి ఫోక‌స్ చేస్తూ…. ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్నది రేవంత్ ఆలోచ‌న‌గా క‌నిసిస్తోంది. ఇటీవ‌ల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ స‌క్సెస్ కావ‌డం..స‌మ్మిట్ లో వ‌చ్చిన 5 ల‌క్షల కోట్ల పెట్టుబ‌డుల‌ను ఎక్స్‌పోజ్ చేసుకోవాలని స‌ర్కార్ ల‌క్ష్యంగా పెట్టుకుందట. మెట్రో విస్తర‌ణ‌, ముఖ్యంగా పాత‌బ‌స్తీకి మెట్రో..ఫ్యూచర్ సిటీ, మూసీ రివ‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కారిడార్..ఇలాంటి అంశాలపై రేవంత్ రెడ్డి సీరియస్‌గా ఉన్నారు. దీంతో న‌గ‌రవాసుల్లో కాంగ్రెస్‌పై పాజిటివిటి పెరిగింద‌ని భావిస్తున్నారట కాంగ్రెస్ లీడర్లు. దీంతో పాటు వ‌చ్చే నెల‌లో దావోస్ ప‌ర్యట‌న‌తో సీఎం రేవంత్ పెట్టుబ‌డులు తీసుకొస్తారని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌ ఫిబ్రవరిలో జీహెచ్ఎంసీ పాల‌క మండ‌లి ప‌ద‌వి కాలం ముగుస్తుండ‌టంతో..జ‌న‌వ‌రి నెలాఖ‌రులో గ్రేట‌ర్ న‌గారా మోగించాలని రేవంత్ ప్రణాళిక సిద్ధం చేసిన‌ట్లు టాక్. ఇక అభివృద్ధి, పెట్టుబడులు, సంక్షేమం ఇవన్నీ ఒక ఎత్తు అయితే..ఎంఐఎం పార్టీతో దోస్తీ మ‌రింత కలసి వస్తుందని భావిస్తోందట అధికార పార్టీ. కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో ముస్లిం ఓట్లు తమకు కన్వర్ట్ కావడంతో పాటు..ఎంఐఎంతో కలిసి గ్రేటర్ పీఠాన్ని సొంతం చేసుకోవచ్చనేది రేవంత్‌ ఈక్వేషన్ అంటున్నారు.

గ్రేటర్ ఎన్నికలకు ఇదే సరైన సమయం..!

ఒక‌వైపు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో గెలుపు, జూబ్లిహిల్స్‌లో విక్టరీ, గ్లోబ‌ల్ స‌మ్మిట్ సక్సెస్‌తో….. ఇదే సరైన స‌మ‌యంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి…. గ్రేట‌ర్‌తో పాటు..మ‌రికొన్ని కార్పొరేష‌న్, మున్సిపాలీట‌ల‌ను కైవ‌సం చేసుకోవాలని ఎత్తులు వేస్తున్నారట. ఆ తర్వాత‌..ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్నది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. రేవంత్ గ్రేట‌ర్ ప్యూహం ఎంత వరకు వ‌ర్కౌట్ అవ‌తుందో చూడాలి.

Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా.. కారణం అదేనా? రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతున్న ప్రచారం ఏంటి?