10tv Grama Swarajyam: 10టీవీ సర్పంచ్‌ల సమ్మేళనానికి ఇదే మా ఆహ్వానం.. మీ సమాచారంతో ఈ నెంబర్‌కు వాట్సాప్ చేయండి..

మీ ఊరు, మండలం, నియోజవకర్గం, జిల్లా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారంతో పాటు మీ ఫోటోను 84980 84015కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది.

10tv Grama Swarajyam: 10టీవీ సర్పంచ్‌ల సమ్మేళనానికి ఇదే మా ఆహ్వానం.. మీ సమాచారంతో ఈ నెంబర్‌కు వాట్సాప్ చేయండి..

Updated On : December 20, 2025 / 7:10 PM IST

10tv Grama Swarajyam: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వచ్చేశాయి. గ్రామాలకు కొత్త సర్పంచ్ లను ఎన్నుకున్నారు. దీంతో ఇక గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. ఎప్పటి నుంచో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు తీరనున్నాయి. ఈ దిశగా సర్పంచ్ లు పని చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.

కొత్త గ్రామ సర్పంచ్‌లకు 10టీవీ శుభాకాంక్షలు తెలుపుతోంది. 10టీవీ సర్పంచ్ ల సమ్మేళనం నిర్వహిస్తోంది. దీనికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. గ్రామ స్వరాజ్యం పేరుతో ఈ సమ్మేళనం నిర్వహిస్తోంది 10టీవీ. ఇందులో మీరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఇందుకోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే.. మీ ఊరు, మండలం, నియోజవకర్గం, జిల్లా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాచారంతో పాటు మీ ఫోటోను 84980 84015కు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఉమ్మడి జిల్లా నుండి 10 మంది సర్పంచ్ లను ఎంపిక చేసి మేము ఆహ్వానిస్తాం. మరెందుకు ఆలస్యం.. వెంటనే 10టీవీ వాట్సాప్ నెంబర్ కు మీ సమాచారం పంపేయండి.

Also Read: సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? గుడ్‌న్యూస్.. ఏకంగా 600 ప్రత్యేక రైళ్లు.. ఏయే రూట్లలో అంటే..