Kavitha Assets Net Worth: కవిత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆమె వద్ద ఎంత గోల్డ్ ఉందంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..

Kavitha Assets Net Worth: 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల కవిత సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ 7.63కోట్లుగా ఉంది. అయితే, 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. మూడేళ్ల కాలంలో ఆమె ఆస్తులు భారీగా పెరిగాయి..

avitha Assets Net Worth According To The Election Affidavit

Kavitha Net Worth: తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా పార్టీని ప్రకటించారు. శనివారం మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లో జరిగిన సభ నుంచి కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) గా ఎనౌన్స్ చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా కొత్త పార్టీపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కవిత ఆస్తుల అంశంపైనా ఆసక్తికర చర్చ జరుగుతుంది. దీంతో ఆమె ఆస్తులు ఎన్ని.. ఆమె వద్ద ఎంత గోల్డ్ ఉందనే విషయాలను తెలుసుకుందాం.

Also Read : కవిత కాకుండా దేశంలో మహిళలు పెట్టిన పార్టీలు ఇవే.. వాటిలో సక్సెస్ అయినవి..

2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో కల్వకుంట్ల కవిత సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తుల విలువ 7.63కోట్లుగా ఉంది. అయితే, 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. మూడేళ్ల కాలంలో ఆమె ఆస్తులు భారీగా పెరిగాయి.. ఆ అఫిడవిట్‌లో ఆమె మొత్తం ఆస్తులు విలువ 39.79కోట్లుగా దాటేసింది. ఇందులో చరాస్తుల విలువ రూ.14.78 కోట్లు కాగా.. స్థిరాస్తుల విలువ 6.70కోట్లుగా ఉంది.

కవిత వద్ద 1.19కిలోల బంగారం, డైముండ్ ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే 11.2 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వీటి విలువ మొత్తం సుమారు రూ.70,71,684గా అప్పట్లో లెక్కించారు. అయితే, కవిత కేవలం రాజకీయ నేతగానే కాకుండా తనను తాను బిజినెస్ ఉమెన్ గా కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆమె పెట్టుబడులు ప్రధానంగా రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల్లో ఉన్నాయి. ఆమె రియల్ ఎస్టేట్ విభాగంలో కూడా భారీగా ఆస్తులు కలిగి ఉన్నారు. ఆమె పేరుతో కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉండగా.. నివాస, వాణిజ్య, ఇతర స్థిరాస్తుల విలువ దాదాపు రూ.10.87కోట్లుగా నమోదైంది. రూ.88.66 లక్షల విలువైన ఇతర చరాస్తులు కలిగి ఉన్నట్లు అప్పటి అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Also Read : బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత మాస్టర్ స్ట్రోక్.. ఇక వారి ప్రయత్నాలు విఫలమైనట్లేనా..?

కవిత పేర్కొన్న ఎన్నికల అపిడవిట్ ప్రకారం.. ఆమె వద్ద టయోటా ఫార్చ్యునర్ కారు ఉంది. దీని విలువ సుమారు రూ.7.58లక్షలుగా చూపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ సమర్పించిన సమయం నాటికి ఆమెకు రూ.21కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. అందులో రూ.2.62 కోట్ల విలువైన కారు, బంగారు రుణాలు ఉండగా.. మిగిలినవి ఇతర రకాల అప్పులు ఉన్నాయి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు కోసం ఆమె 7కోట్ల మేర అప్పు చేశారు.