Chandrashekhar Azad, MLC Kavitha
MLC Kavitha – Chandrashekhar Azad: భీమ్ ఆర్మీ (Bhim Army) చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇవాళ హైదరాబాద్ (Hyderabad)లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవితను కలిశారు. అనంతరం కవిత, చంద్రశేఖర్ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సందర్శించేందుకు ఆజాద్ ఇక్కడకు వచ్చారని కవిత అన్నారు. ఆజాద్ కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. ఆజాద్ తన పోరాటంలో ముందుకు వెళ్లాలని, ఆయన వెంట తాము ఉంటామని చెప్పారు. ఎన్నో ఏళ్లపాటు పోరాడి, తెలంగాణను సాధించుకున్నామని కవిత అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ నిబద్ధతతో పనిచేస్తున్నారని చెప్పారు.
Chandrashekhar Azad, MLC Kavitha
చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ… తాను ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు కవిత అక్క బీఆర్ఎస్ ఎంపీలను పంపించి మద్దతు ప్రకటించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు వర్గాల ప్రజలను పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం చాలా సంతోషకరమని అన్నారు.
కొత్త పార్లమెంట్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. స్వాతంత్ర్యం రాకముందు అంబేద్కర్ తో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా వాళ్లకే ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. బీఆర్ఎస్ దేశంలోనూ విజయం సాధించాలని చెప్పారు.
Nandigama Constituency: నందిగామ టీడీపీలో గ్రూపు తగాదాలే వైసీపీకి మేలు చేస్తాయా?