పార్టీ ఆమెను దూరం పెట్టింది..ఆమె కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. బట్ ఇవి రెండు సేమ్ కాదు. కవితను బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు కాబట్టి..ఆమె పార్టీలో యాక్టీవ్‌గా ఉండటం లేదు. ఈ ఎపిసోడ్ తెలంగాణ పాలిటిక్స్‌లో డైలీ ఎపిసోడ్ అయిపోయింది. కవిత లేఖ, ఆ లెటర్ లీక్..కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలతో..కవిత, బీఆర్ఎస్ మధ్య ఆల్ ఆఫ్ సడెన్‌గా కోల్డ్ వార్ రచ్చకెక్కింది. కవిత ఓపెన్‌గానే స్టేట్‌మెంట్లు ఇస్తుండటం..ఆమె ఇష్యూలో ఎలా స్పందించాలో తెలియక బీఆర్ఎస్ లీడర్లు డైలమాలో పడిపోవడం గందరగోళానికి దారితీసింది.
ఈ క్రమంలో పలువురు నేతలు కవిత విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారట. అయితే పిలిచి మాట్లాడి అంతా సెట్ చేయండి. లేకపోతే ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకోండి. అంతే కానీ ఎన్నాళ్లు ఇలా. అంటూ లీడర్లు అక్కడక్కడ ప్రస్తావించడంతో ఇది ఆ నోట ఈ నోట గులాబీ బాస్ చెవిలో పడిందట. రెండు నెలలుగా కవిత ఎపిసోడ్‌పై మౌనంగా ఉంటున్న కేసీఆర్ ఇప్పుడు ఏదో ఒకటి తేల్చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో కేసీఆర్ నుంచి కవితకు పిలుపురానుందన్న టాక్ వినిపిస్తోంది.
కవిత వ్యవహారం పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు నేతలు, క్యాడర్‌ను కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోందన్న ఆందోళన బీఆర్ఎస్ పార్టీలో నెలకొందట. పైగా ఇంకా ఆలస్యం చేస్తే పార్టీకి నష్టం తప్పదని భావిస్తున్నారట. అందుకే కవితను పిలిచి మాట్లాడాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. ఆమె అసంతృప్తి, అభ్యంతరాలేంటో తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇలా కవిత విషయంలో తాడో పేడో తేల్చేయాలన్న నిర్ణయానికి గులాబీ బాస్ వచ్చినట్లు తెలుస్తోంది.
కవితపై చాలా సీరియస్‌గా కేసీఆర్
ఈ క్రమంలోనే కవిత అసంతృప్తికి కారణాలు, ఆమె అభ్యంతరాలు, డిమాండ్స్ ఏంటో తెలుసుకోబోతున్నారట. ఒకట్రెండు రోజుల్లో కవితను ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని ఆమెతో డిస్కస్ చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని పరోక్షంగా ఇప్పటికే తేల్చి చెప్పిన కవిత..కేసీఆర్ పిలిచి మాట్లాడితే ఏయే అంశాలను ప్రస్తావిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే కవితపై కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది.
అందుకే కాళేశ్వరం విచారణప్పుడు ఫామ్‌హౌస్‌కు వెళ్లినా..హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందేందుకు వెళ్లినప్పుడు పరామర్శించడానికి వెళ్లినా కేసీఆర్ ఆమెతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ దృష్ట్యా సాధ్యమైనంత వరకు కేసీఆర్ కవితను బుజ్జగించే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఒకవేళ ఎంత చెప్పినా వినకపోతే మాత్రం సీరియస్ యాక్షన్‌కు కూడా వెనకాడబోరని గులాబీ ముఖ్యనేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.