Bandi Sanjay: ఫాంహౌస్ వాళ్లదే.. ఫిర్యాదు చేసిందీ వాళ్లే..: బండి సంజయ్

టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియో కలకలం రేపుతున్న వేళ దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కు వచ్చిన వారు బీజేపీ నేతలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అక్కడి ఫాంహస్ వాళ్లదేనని, అలాగే, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లేనని చెప్పారు.

Bandi Sanjay: టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బయటకు వచ్చిన వీడియో కలకలం రేపుతున్న వేళ దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కు వచ్చిన వారు బీజేపీ నేతలని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

అక్కడి ఫాంహస్ వాళ్లదేనని, అలాగే, ఫిర్యాదు చేసింది కూడా వాళ్లేనని చెప్పారు. డ్రామాలు ఆడడం టీఆర్ఎస్ కు కొత్తేమీ కాదని, గతంలో ఓ మంత్రిపై హత్యాయత్నం జరిగిందని కూడా నాటకాలు ఆడారని అన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు స్వామీజీలు వెళతారా? అని నిలదీశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు హిందూ ధర్మం అంటే కోపం ఎందుకని ప్రశ్నించారు.

కుట్రలు పన్ని తమపై బురద చల్లడానికే కేసీఆర్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. టీఆర్ఎస్ కు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్ కు తరలించకుండా, వారిని ప్రగతిభవన్‌కు ఎలా రమ్మంటారని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ ఎమ్మెల్యేలను 50 పైసలకు కూడా ఎవరూ కొనరని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ ఆ డ్రామా ఆడుతున్నారని ఆయన అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..