Khammam student Varun Raj
Khammam student Varun Raj : అమెరికాలో కొద్దిరోజుల క్రితం జిమ్ నుంచి వస్తున్న క్రమంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ (29)తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతున్నాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వరుణ్ రాజ్ బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వరుణ్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read : Wife Killed Husband : కూతురు సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎందుకో తెలుసా?
ఖమ్మం పట్టణం మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన వరుణ్ రాజ్ అమెరికాలో ఇండియానా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. 2022 ఆగస్టులో అతడు అమెరికా వెళ్లినట్లు తెలిసింది. అక్టోబర్ 31న జిమ్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. దీంతో వరుణ్ రాజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం వరుణ్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
Also Read : Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్
వరుణ్ తండ్రి రామ్మూర్తి మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇదిలాఉంటే వరుణ్ తలపై కత్తితో దాడిచేసిన జోర్దాన్ ఆండ్రేడ్ ను అరెస్టు చేసినట్లు టైమ్స్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఇండియా నివేదించింది.