Khanapur Result : అనూహ్య పరిణామం.. BRS,BJP పొత్తు.. ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ స్థానాలు కైవసం
Khanapur Result : ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని.. అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించాయి.
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 06:48 AM IST
khanapur municipality election 2026 bjp won with brs party support
- ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు
- ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులు సొంతం
Khanapur Result : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అనే మాట నూటికి నూరు శాతం నిజమని మరోసారి నిరూపితమైంది. పొద్దున లేచింది మొదలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తాజాగా జట్టు కట్టాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించాయి. ఇంతకీ ఈ అరుదైన సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అంటే.. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకున్నాయి.
ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక శనివారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా పడింది. తిరిగి ఆదివారం నిర్వహించారు. ప్రశాంతంగా కొనసాగిన ఈ ఎన్నికలో మొత్తం 12 మంది సభ్యులున్న కౌన్సిల్‌కు ఎన్నిక నిర్వహించారు. ఈ క్రమంలో బీజేపీ 4, బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలుపొందగా.. అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం 3 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే విజయం సాధించిన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీటితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది.
BRS Party : ఉత్కంఠకు తెర.. ఆ రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి..
అయితే ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బీజేపీ తరపున బరిలో నిలిచిన అంకం మౌనికకు.. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల నుంచి ఏడుగురు సభ్యులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థిగా చిన్నం సత్యనారాయణను ప్రతిపాదించగా, ఆరుగురు మాత్రమే మద్దతివ్వడంతో మౌనిక విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్ మహ్మద్ సోయెబ్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
