TGSRTC Salaries: ఆర్టీసీ ఉద్యోగుల గుడ్ న్యూస్.. పే స్కేల్ పై కీలక ఆదేశాలు..
TGSRTC Staff Salaries Revision: మే 10లోపు కొత్త పే స్కేల్స్ రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చారు ఎండీ. విధి విధానాలు రూపొందించాలని సూచనలు చేశారు.
Tgsrtc Staff Salaries Revision
TGSRTC Salaries: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై కీలక ముందడుగు పడింది. ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తికి మేనేజింగ్ డైరెక్టర్ స్పందించారు. 2021 వేతన సవరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అధికారులతో పే కమిటీ నియామకం చేశారు. కె.గీత, సమీరా అఫ్రీన్, వై.శిరీషలకు కమిటీలో చోటు కల్పించారు. మే 10లోపు కొత్త పే స్కేల్స్ రూపకల్పనకు ఆదేశాలు ఇచ్చారు ఎండీ. విధి విధానాలు రూపొందించాలని సూచనలు చేశారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆమోదంతో చర్యలు తీసుకున్నారు. దీనిపై జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. వేతన సవరణ హామీని వెంటనే అమలు చేసినందుకు ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. మిగతా హామీలు కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని జేఏసీ నాయకులు కోరారు.
Also Read: తెలంగాణ పది ఫలితాల విడుదలకు ముహుర్తం ఫిక్స్.. వాట్సాప్ లో ఇలా చెక్ చేసుకోండి..
